Xamalicious Malware: ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆన్‌లైన్ మోసాల గురించి వింటూనే ఉన్నాం. ఒక రకమైన మోసాన్ని కనుగొనేలోపు హ్యాకర్లు మరో 10 రకాలైన మోసాలతో వస్తూ ఉంటారు. అలాగే భద్రతా పరిశోధకులు కూడా ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో వివిధ విషయాలను పరిశోధిస్తూ వాటిలో లోపాలను కనుగొంటారు. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రజల భద్రత కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తాయి. ఇప్పుడు మెకాఫీ పరిశోధకులు ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేశారు. వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండి కొన్ని యాప్‌లను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఆండ్రాయిడ్ యాప్‌ల్లో లోపాలు
పరిశోధకులు మాల్వేర్‌ను కలిగి ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లను కనుగొన్నారు. అందులో 'Xamalicious' అనే ప్రమాదకరమైన మాల్వేర్ కనిపించింది. ఇది మూడు లక్షల కంటే ఎక్కువ పరికరాలను ప్రభావితం చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 14 యాప్‌లలో ఈ ప్రమాదకరమైన మాల్వేర్ ఉంది. ఇది వ్యక్తుల డివైస్‌లకు యాక్సెస్ పొందడం ద్వారా సమాచారాన్ని దొంగిలిస్తుంది.
లక్షకు పైగా డౌన్‌లోడ్స్
ఈ మాల్వేర్ ఉన్న 14 యాప్‌లలో మూడు యాప్‌లను లక్ష మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అంటే వీళ్లందరి ప్రైవసీకి భంగం వాటిల్లిందన్న మాట. మంచి విషయమేమిటంటే గూగుల్ ఇప్పుడు ఈ యాప్‌లన్నింటినీ ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయితే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన, ఇప్పటికీ వాటిని ఫోన్‌లో కలిగి ఉన్నవారికి ఇది ఆందోళన కలిగించే విషయం.
ఈ యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి
ఎసెన్షియల్ హోరోస్కోప్ ఫర్ ఆండ్రాయిడ్ (Essential Horoscope for Android) (లక్ష మంది ఇన్‌స్టాల్ చేశారు)
3డీ స్కిన్ ఎడిటర్ ఫర్ పీఈ మైన్‌క్రాఫ్ట్ (3D Skin Editor for PE Minecraft) (లక్ష మంది ఇన్‌స్టాల్ చేశారు)
లోగో మేకర్ ప్రో (Logo Maker Pro) (లక్ష మంది ఇన్‌స్టాల్ చేశారు)
ఆటో క్లిక్ రిపీటర్ (Auto Click Repeater) (10,000 మంది ఇన్‌స్టాల్ చేశారు)
కౌంట్ ఈజీ క్యాలరీ కాలిక్యులేటర్ (Count Easy Calorie Calculator) (10,000 మంది ఇన్‌స్టాల్ చేశారు)
డాట్స్: వన్ లైన్ కనెక్టర్ (Dots: One Line Connector) (10,000 మంది ఇన్‌స్టాల్ చేశారు)
సౌండ్ వాల్యూమ్ ఎక్స్‌టెండర్ (Sound Volume Extender) (5,000 మంది ఇన్‌స్టాల్ చేశారు)
ఇవి కాకుండా 'Xamalicious' అనే మాల్వేర్ ద్వారా ప్రభావితమైన మరో 12 యాప్‌లు ఉన్నాయి. అవి థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు లేదా స్టోర్‌ల్లో ఉన్నాయి. ఏఎన్ఐ నివేదిక ప్రకారం ఈ యాప్‌లు ఏపీకే రూపంలో ఉన్నాయి. ప్రజల ప్రైవసీకి భంగం వాటిల్లేలా చేస్తున్నాయి.
Xamalicious అనేది ఆండ్రాయిడ్ బ్యాక్‌డోర్. ఇది .NET ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ సోర్స్ Xamarin ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించి రూపొందించిన యాప్‌లలోకి అటాచ్ అవుతుంది. యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ మాల్వేర్ యాక్సెసిబిలిటీ సర్వీస్‌కు యాక్సెస్‌ను పొందుతుంది. ఆపై స్క్రీన్‌పై విషయాలను రికార్డ్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లోని యాప్‌ల నుండి డేటాను దొంగిలిస్తుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!