Apple WWDC 2023: యాపిల్ తన వార్షిక ఈవెంట్ తాజా ఎడిషన్‌లో అనేక ప్రకటనలు చేసింది. మరో వైపు కంపెనీ తన అభిమానులను కొత్త డివైస్‌లతో ట్రీట్ ఇచ్చింది. అదే సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు కూడా వచ్చాయి. ఇవి కంపెనీ పాత వినియోగదారుల కోసం విడుదల అయ్యాయి. చాలా మంది ప్రజల దృష్టి ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17పై ఉంది. దీంతో పాటు కంపెనీ iPadOS 17, watchOS 10 లను కూడా ప్రకటించింది.


ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 17 గురించి చెప్పాలంటే ఇందులో చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టంతో వినియోగదారులు తమ ఫోటోలనే స్టిక్కర్‌లుగా తయారు చేయవచ్చు. ఇది కాకుండా దాని కీప్యాడ్‌ను కూడా మాడిఫై చేశారు. దీని కారణంగా యాపిల్ డివైసెస్‌లో టైప్ చేయడం మరింత సులభం అవుతుంది.


iOS 17లో అందుబాటులో ఉండే ప్రధాన ఫీచర్లు
ఈ కొత్త అప్‌డేట్‌తో నేమ్ డ్రాప్ ఫీచర్, ఫేస్‌టైమ్ వీడియో మెసేజ్ ఫీచర్లు అందించారు. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన స్టాండ్‌బై మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టాండ్ బై మోడ్ ద్వారా  ఐఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు లాక్ స్క్రీన్ హారిజంటల్‌గా మారుతుంది. ఇది ఐఫోన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మారుస్తుంది.  దీనిపై డేట్, టైం, లైవ్ యాక్టివిటీస్, విడ్జెట్స్‌ను చూడవచ్చు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.


దీంతో పాటు జర్నల్ యాప్‌ను కూడా క్రియేట్ చేశారు. అంటే వినియోగదారుల డైలీ లైఫ్‌ను, వారి యాక్టివిటీస్‌ను ఇది ట్రాక్ చేస్తుంది. దాని ద్వారా వినియోగదారుల జీవితాన్ని జర్నల్‌లా రూపొందిస్తుంది. ఇందులో ఫొటోలు, వీడియోలను కూడా ఇముడ్చుతుంది. ఇలాంటి యాప్‌పై ప్రైవసీ ఎలా ఉంటుందో అని సందేహాలు ఉండటం సహజమే. కానీ ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుంది.


నేమ్ డ్రాప్ అనే ఫీచర్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఇద్దరు యాపిల్ యూజర్లు సమీపంలోకి వచ్చినప్పుడు ఎయిర్ డ్రాప్‌లో ఫొటోలు, వీడియోలు ఎలా షేర్ చేసుకుంటారో, అలా తమ కాంటాక్ట్ డిటైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే మీకు సమీపంలో ఉన్న యాపిల్ యూజర్ల కాంటాక్ట్ డిటైల్స్‌ను మీరు రిక్వెస్ట్ చేయవచ్చు. వారు యాక్సెప్ట్ చేస్తే ఇద్దరి కాంటాక్ట్ డిటైల్స్ ఎక్స్‌ఛేంజ్ అవుతాయి.


ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను పొందే డివైస్‌లు ఇవే
ఐఫోన్ 14 ప్రో/14 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్
ఐఫోన్ ఎస్ఈ (2022)
ఐఫోన్ 13, 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 12, 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్
ఐఫోన్ XS/XS మ్యాక్స్, ఐఫోన్ XR


Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!