Instagram Threads: ట్విటర్‌కు పోటీ థ్రెడ్స్ అనే యాప్‌ను మెటా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 100కు పైగా దేశాల్లో థ్రెడ్స్ లాంచ్ అయింది. థ్రెడ్స్ లాంచ్ అయినప్పటి నుంచి అందరికీ తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. ట్విట్టర్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ‘థ్రెడ్స్’ మారుతుందా? 


70 మిలియన్ల యూజర్ బేస్
ఇప్పటి వరకు 70 మిలియన్ల మంది థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఇంత భారీ యూజర్ బేస్ సాధించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. థ్రెడ్స్ యూజర్‌బేస్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ట్విట్టర్‌తో కంపేర్ చేస్తే ఈ యాప్‌పై యూజర్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది. యాప్‌లో ఉన్న లోపాలు, తక్కువ ఫీచర్లే దీనికి ప్రధాన కారణం. 


ఈ యాప్ లాంచ్ అయిన తర్వాత ట్విట్టర్‌ని థ్రెడ్స్ రీప్లేస్ చేస్తుందా? అనే ప్రశ్న చాలా మందికి తలెత్తింది. ఈ ప్రశ్నకు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరీ సమాధానం ఇచ్చారు. ది వెర్జ్ జర్నలిస్ట్ అలెక్స్ హీత్ ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌ని ఇలాంటి ప్రశ్న అడిగారు. మోస్సేరి దానికి ఆన్సర్ ఇస్తూ థ్రెడ్స్ టార్గెట్ ట్విట్టర్‌ను రీప్లేస్ చేయడం కాదని చెప్పారు. ట్విట్టర్‌ను ఎప్పుడూ స్వీకరించని కమ్యూనిటీల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ స్పేస్‌ను సృష్టించడమే థ్రెడ్స్ లక్ష్యం అన్నారు. కోపం ఎక్కువగా ఉండని ప్లాట్‌ఫాంలపై  ఆసక్తి ఉన్న కమ్యూనిటీలను తాము లక్ష్యంగా చేసుకున్నాయని మోస్సేరి చెప్పారు. 


మరో ప్రశ్నకు సమాధానంగా ఇన్‌స్టాగ్రామ్‌తో భాగంగా ఉన్నందున ఈ ప్లాట్‌ఫారమ్‌లో రాజకీయాలు, కఠినమైన వార్తలు తక్కువగా కనిపిస్తాయని మోస్సేరి అన్నారు. కఠినమైన వార్తలు, రాజకీయాల కోసం థ్రెడ్స్‌ను రూపొందించలేదన్నారు. ప్లాట్‌ఫారమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయని, వాటి నుండి కంపెనీ, యూజర్లు మంచి డబ్బు సంపాదించవచ్చని మోస్సేరి చెప్పారు.


థ్రెడ్స్ యాప్‌కు ప్రజాదరణ కూడా భారీగా ఉంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో ట్విట్టర్ వినియోగదారులు విసుగు చెందుతున్నారు. వారు ప్రత్యామ్నాయాన్ని కూడాకోరుకున్నారు. థ్రెడ్స్ రాకతో ప్రజలకు మంచి ఆప్షన్ లభించింది. దీని కారణంగా ప్రజలు వేగంగా స్విచ్ అవుతున్నారు.














Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial