Wifi Tricks For Users: WiFiలో ఎటువంటి సమస్య లేనప్పటికీ దాని స్పీడ్ తగ్గడం లేదా సమస్యలు తలెత్తడం ప్రారంభం అయిందా? అయితే మీరు కూడా వైఫై ద్వారా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.  కేవలం ఇది మాత్రమే కాదు, చాలా సార్లు కొంతమంది సర్వీసును కూడా మార్చుకుంటారు. కొత్త సర్వీస్ కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? ఈ రోజు మనం దాని కారణం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

Continues below advertisement


నెట్‌వర్క్ స్ట్రెంత్
మీ వైఫై నెట్‌వర్క్ స్ట్రెంత్ తగ్గిపోయినట్లయితే, మీ వైఫైని ఎవరైనా హ్యాక్ చేసి ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ వైఫైని రీసెట్ చేయండి. మీ పాస్‌వర్డ్‌ను బలంగా ఉండేలా మార్చండి.


సిగ్నల్ హెచ్చుతగ్గులు
సిగ్నల్ హెచ్చుతగ్గుల సమస్య మీ వైఫైతో నిరంతరం వస్తుంటే, మీ వైఫై హ్యాక్ అయ్యి ఉండే అవకాశం ఉంది. సిగ్నల్ హెచ్చుతగ్గులు ఉండటం సర్వసాధారణం. కానీ అది నిరంతరంగా ఉంటే మీరు వెంటనే మీ WiFi పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలి.


డెడ్ వైఫై సిగ్నల్
మీ వైఫై సిగ్నల్ పూర్తిగా డెడ్ అయితే, మీ వైఫై హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ కేర్ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు ముందుగా మీ వైఫై పవర్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీరు దాన్ని రీసెట్ చేసి పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.


వైఫై పవర్ ఆఫ్
మీ వైఫై పదే పదే ఆఫ్ అవుతూ ఉంటే మరియు ఇలా జరగడానికి సరైన కారణం మీకు తెలియకపోతే, మీ వైఫై హ్యాక్ అయి ఉండవచ్చు. ఈ సమస్య విషయంలో మీరు కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?