Telegram Ban in India: భారత్ సహా పలు దేశాలలో మెసేజింగ్ యాప్‌ల వాడకం పెరిగింది. నేడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, కొలీగ్స్‌తో ఛాటింగ్ నుండి ఎడ్యేకేషన్, వ్యాపారం, పెద్ద పెద్ద కమ్యూనిటీల వరకు ఇప్పుడు మొబైల్ యాప్‌లపైనే ఆధారపడుతున్నాం. కానీ మంగళవారం నాడు భారత ప్రభుత్వం నీట్ పరీక్షకు సంబంధించి టెలిగ్రామ్ (Telegram App) పై కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే అందరికీ వస్తున్న డౌట్ వాట్సాప్ (WhatsApp) లాంటి మెస్సేజింగ్ యాప్‌నకు బదులుగా టెలిగ్రామ్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ. దీని వెనుక టెలిగ్రామ్ పనిచేసే విధానం, దాని ప్రత్యేక ఫీచర్లు కారణంగా మారాయి. 

Continues below advertisement

టెలిగ్రామ్ గురించి ప్రశ్నలు ఎందుకు తలెత్తాయి?టెలిగ్రామ్ యాప్ దాని వేగం, పెద్ద గ్రూపులు, ఫైల్ షేరింగ్ సామర్థ్యంతో యూజర్లను ఆకట్టుకుంది. వాట్సాప్‌లో గ్రూపులు, ఛానెల్‌లకు కొన్ని లిమిట్స్ ఉండగా, టెలిగ్రామ్‌లో ఒకేసారి లక్షలాది మందికి ఏదైనా సమాచారాన్ని షేర్ చేయవచ్చు. ఇదే కారణంతో చాలాసార్లు కొందరు వ్యక్తులు టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ను తప్పుడు పనులకు కూడా ఉపయోగిస్తున్న సందర్భాలు ఉన్నాయి.  పెద్ద పబ్లిక్ ఛానెల్‌లు, అన్‌లిమిటెడ్ ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్ల కారణంగా చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా సెన్సిటివ్ కంటెంట్ సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి కేసులలో అధికారులు మొదట ఫోకస్ చేసింది టెలిగ్రామ్‌పైనే. 

Also Read: MiOffice AI: డేటా సెక్యూరిటీతో 150కిపైగా డిజిటల్‌ టూల్స్ ఒకే చోట! వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చిన MiOffice AI

Continues below advertisement

టెలిగ్రామ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?టెలిగ్రామ్ ఒక క్లౌడ్ బేస్డ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. అంటే మీ మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు కేవలం ఫోన్‌లోనే కాకుండా టెలిగ్రామ్ సర్వర్లలో కూడా సేఫ్‌గా ఉంటాయి. ఇందువల్లే మీరు ఏ కొత్త డివైజ్‌లోనైనా లాగిన్ అయినా పాత చాట్స్‌ని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.

వాట్సాప్ అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అయితే టెలిగ్రామ్‌ యాప్‌లో నార్మల్ చాట్స్ క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. టెలిగ్రామ్ సీక్రెట్ చాట్ (Secret Chat) పేరుతో స్పెషల్ ఫీచర్ అందిస్తుంది. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. మెసేజ్‌లకు ఎక్కువ భద్రత లభిస్తుంది.

వాట్సాప్, టెలిగ్రామ్ మధ్య ప్రధాన వ్యత్యాసంవాట్సాప్ ఎక్కువగా వ్యక్తిగత సంభాషణలకు వాడతారు. అయితే టెలిగ్రామ్ పెద్ద కమ్యూనిటీలు, పబ్లిక్ ఛానెల్‌లతో ఫేమస్ అయింది. లిగ్రామ్‌లో ఒక ఛానెల్ ద్వారా లక్షలాది మందికి మెసేజ్ పంపవచ్చు. పెద్ద ఫైళ్లను షేర్ చేయడం, ఆటోమేటెడ్ బాట్స్ (Bots) ఉపయోగించడం టెలిగ్రామ్ కు ప్లస్ పాయింట్. ఈ కారణంగానే టెలిగ్రామ్ యాప్‌ను చదువు, బిజినెస్, కంటెంట్ షేరింగ్ కోసం ప్రత్యేకంగా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవే ఫీచర్లను కొందరు దుర్వినియోగం చేసే అవకాశాన్ని కూడా పెంచుతాయి.

టెలిగ్రామ్ పూర్తిగా సేఫ్ కాదా..అలా అని చెప్పడం కరెక్ట్ కాదు. టెలిగ్రామ్ యాప్ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్‌కోడ్ లాక్ (Passcode Lock),  సీక్రెట్ చాట్ వంటి పలు సేఫ్టీ ఫీచర్లను ఇస్తుంది. సేఫ్టీ ఉన్న కారణంగానే  చాలా వరకు వినియోగదారులు యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకేసారి ఛానల్స్ లేదా గ్రూపులతో కనెక్ట్ అయి దాని వినియోగించే వ్యక్తులపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది.