MiOffice AI: డిజిటల్‌ యుగంలో పనులు ఎంత ఈజీగా అవుతున్నాయో ప్రమాదం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా డేటా చోరీ అందర్నీ హడలెత్తిస్తోంది. అందుకే ఆన్‌లైన్ టూల్స్ వాడుకోవాలంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తోంది. దీనికి తెలుగు ప్రతిభ సంస్థ పరిష్కారం చూపింది. ఎంతో విలువైన టూల్స్‌ అన్నీ ఒకే చోట అందించిన ఈ సంస్థకు చెందిన MiOffice AI మరో వండర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్‌తో మీ ముందుకు వచ్చింది. 

Continues below advertisement

ఇంతకీ ఏంటీ MiOffice AI ?

MiOffice AI అనేది మీ ప్రొడక్టివిటీని రెట్టింపు చేసే 150కిపైగా డిజిటల్ టూల్స్ ఉచితంగా అందించే ప్లాట్‌ఫామ్. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తలు, టెక్కీస్‌ ఇలా అందర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాట్‌ఫామ్ అనేక టూల్స్‌ను అందిస్తోంది. ఒకే చోటా మీ పనులు పూర్తి అయ్యేలా చేస్తుంది. ఎక్కువ వెబ్‌సైట్లపై ఆధారపడకుండా ఉండేలా చేస్తుంది. 

డేటా ప్రైవసీ స్పెషలిస్ట్‌ MiOffice AI    

ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇంత ఫేమస్ చేసింది వారు వాడే వెబ్‌అసెంబ్లీ(WASM) టెక్నాలజీ. వేరే వెబ్‌సైట్‌లో మీరు ఫొటోను రీసైజ్ చేయాలంటే, మీరు ఫొటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా ప్రాసెస్ జరుగుతుంది. మీ ఫొటోలను వారి సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పని పూర్తి చేస్తుంది. 

Continues below advertisement

కానీMiOffice AIలో ఉండే టూల్స్ చాలా ప్రత్యేకం. నేరుగా మీ కంప్యూటర్, మొబైల్ బ్రౌజర్‌లోనే కావాల్సిన పనిని పూర్తి చేస్తాయి. అంటే మీ డేటా వారి సర్వర్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. దీని వల్ల మీ వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉంటుంది. 

ఎంత పని అయిన బ్యాచ్‌ ప్రాసెసింగ్‌తో సింపుల్ 

మీరు ఒకేసారి 50కిపైగా ఫైళ్లను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ MiOffice AI యూజ్‌ఫుల్ అవుతుంది. దీని కోసం Batch Processing అనే టూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఫొటోల క్వాలిటీ పెంచాలన్నా, వీడియో నుంచి ఆడియోను వేరు చేయాలన్నా ఇక్కడ మీకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు రసీదులు, గుర్తింపు కారులను స్కాన్ చేయాల్సి వస్తే MiOffice AIలో లభించే టూల్స్ ద్వారానే మొబైల్ కెమెరాను స్కానర్‌గా మార్చుకోవచ్చు.  

అందుబాటులోకి వచ్చిన ఏఐ స్టూడియోతో అద్భుతాలు

MiOffice AIలోని ఏఐ స్టూడియో ద్వారా కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సమరైజేషన్ చేయవచ్చు, కంటెంట్‌ క్రియేషన్ కూడా ఇక్కడ చాలా సులువుగా ఉంటుంది. పీడీఎఫ్‌లను మెర్జ్ చేయాలన్నా, సపరేట్ చేయాలన్నా, వర్డ్‌ ఫార్మాట్‌లోకి మార్చడం వంటివి ఒకట్రెండు క్లిక్‌లతోనే పూర్తి అవుతాయి. దీనికి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు. కంప్యూటర్, మొబైల్ వాడటం వస్తే చాలు. 

మల్టీమీడియా సదుపాయాలు

ఇమేజ్ ప్రాసెసింగ్‌ విభాగంలో ఏఐ ఆధారిత బ్యాక్‌గ్రౌండ్‌ రిమూవర్‌, ఫొటో ఆప్టిమైజేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియోలను ట్రిమ్ చేయం, GIFలుగా మార్చడం వంటి మల్టీమీడియా పనులు కూడా ఇక్కడ చేయడం చాలా ఈజీ. మొబైల్ ఫోన్ ద్వారా పత్రాలను నేరుగా పీడీఎఫ్‌లుగా మార్చుకునే డాక్యుమెంట్‌ స్కానింగ్ సదుపాయం మరో ఆకర్షణ. 

ఉచితంగానే 150 టూల్స్ 

ప్రస్తుతం MiOffice AI లోని 150 టూల్స్ కూడా పూర్తి ఉచితంగా పొందవచ్చు. చాలా సేవల కోసం కనీసం మీరు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. వేగం, సౌలభ్యం, సెక్యూరిటీతో కలిపి సేవలు అందిస్తున్న MiOffice AI నిజంగా మంచి ప్లాట్‌ఫామ్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.