మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Whats App కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24 నుంచి పలు రకాల స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కూడా పలు ఫోన్లకు వాట్సాప్ సర్వీసులను నిలిపివేసింది. వాటిలో ఎక్కువగా వాడుకలో లేని ఫోన్లే ఉన్నాయి. అవన్నీ పాత ఆపరేటింగ్ సిస్టమ్ తోనే రన్ అవుతున్నాయి.
20కి పైగా మోడల్స్ లో వాట్సాప్ నిలిపివేత
ప్రస్తుతం, Android వెర్షన్ 4.1 అంతకంటే పాత వాటిపై నడుస్తున్ స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్స్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం 20కి పైగా స్మార్ట్ ఫోన్లు వచ్చే అక్టోబర్ నుంచి కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా ఎలాంటి అప్‌డేట్స్ అందుకోలేవు. చివరికి, ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం ఆపివేస్తుంది. ఈ జాబితాలో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ చాలా వరకు పాత ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే రన్ అవుతున్నాయి.
WhatsApp సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లు ఇవే
Android OS వెర్షన్ 4.1, అంతకంటే పాత OSపై నడుస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ల ఏంటో ఇప్పుడు చూద్దాం. Nexus 7 (upgradable to Android 4.2), Samsung Galaxy Note 2, HTC One, Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC Sensation, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola Xoom, Samsung Galaxy Tab 10.1, Asus Eee Pad Transformer, Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericsson Xperia Arc3 ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లలో అక్టోబర్ నుంచి వాట్సాప్ పని చేయదని కంపెనీ వెల్లడించింది.
చాలా వరకు ఉపయోగంలో లేని ఫోన్లే!
“వాట్సాప్ సపోర్టు చేయని ఫోన్లలో చాలా వరకు పాత మోడల్ ఫోన్లే ఉన్నాయి. వీటిని ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫోన్లలో వాట్సాప్ మాత్రమే కాదు, ఇతర యాప్స్ కూడా సపోర్టు చేయవు. సెక్యూరి ఫీచర్ల అప్ డేషన్ లేకుండా ఉంటే మీ ఫోన్ సైబర్ బెదిరింపులకు గుర్యే అవకాశం ఉంది. దయచేసి మీ స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేసుకోండి” అని వాట్సాప్ తమ వినియోగదారులకు సూచించింది. .
WhatsApp సపోర్టు చేసే మోడల్స్ ఇవే!
అక్టోబర్ తర్వాత వాట్సాప్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. Android OS వెర్షన్ 5.0, ఆ తర్వాత వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో పని చేస్తుంది. iOS 12, ఆపై వాటిలో రన్ అవుతుంది. JioPhone, JioPhone 2తో సహా KaiOS 2.5.0, ఆ తర్వాత ఓఎస్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుంది.
Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial