Whatsapp Colour Change: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. దీని కారణంగా వినియోగదారులు ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కాదని వేరే యాప్‌ను ట్రై చేయడానికి ఇష్టపడరు. 2024లో వాట్సాప్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లు వాట్సాప్ కలర్, థీమ్‌ను మార్చుకోగలరు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వాట్సాప్‌ను ఆకుపచ్చ, నీలం, తెలుపు, కోరల్, పర్పుల్ రంగులలో మార్చుకునే అవకాశాన్ని పొందుతారు.


వాట్సాప్‌లో కొత్త కలర్ ఆప్షన్‌లు కూడా...
వాట్సాప్ గురించి సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ ఐవోఎస్ వాట్సాప్ బీటా వెర్షన్ 24.1.10.70లో కనిపించింది. బీటా వెర్షన్‌లో తీసిన స్క్రీన్‌షాట్‌లో, వినియోగదారులు ఐదు కలర్ ఆప్షన్లు పొందవచ్చని తెలుస్తోంది.


వాట్సాప్ థీమ్ కస్టమైజేషన్ ఫీచర్ సాయంతో వినియోగదారులు వాట్సాప్ కలర్‌ను మార్చగలరు. ఈ ఫీచర్ కారణంగా వాట్సాప్ మొత్తం రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలు వాట్సాప్‌ను ఒకే థీమ్, కలర్‌లో ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కొత్త కలర్, థీమ్ వినియోగదారులకు ఒక కొత్త తరహా అనుభవాన్ని ఇవ్వనుంది.


2024లో అనేక మార్పులు
ఇది కాకుండా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. దీని పేరు బబుల్ కలర్ చేంజ్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు పర్సనలైజేషన్‌ను పొందుతారు. అంటే వినియోగదారులు తమకు నచ్చినట్లు వాట్సాప్‌ను ఉపయోగించుకోగలుగుతారు. వాట్సాప్ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్లన్నింటిపై పనిచేస్తోంది.


ఈ కలర్ ఫీచర్లతో పాటు వాట్సాప్ 2024లో అనేక ఇతర ప్రత్యేక మార్పులను చేయనుంది. రాబోయే కాలంలో వినియోగదారులు వాట్సాప్ ఛాట్ల ఉచిత అపరిమిత బ్యాకప్‌ను పొందలేరు. ఇది ఇప్పటివరకు గూగుల్ డిస్క్ ద్వారా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులకు వారి గూగుల్ డ్రైవ్‌లో ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఉచిత వాట్సాప్ బ్యాకప్ చేసుకోవచ్చని కంపెనీ నిర్ణయించింది. అంటే గూగుల్ డ్రైవ్‌లో అందుబాటులో ఉన్న 15 జీబీ ఉచిత స్టోరేజ్‌లో మాత్రమే వాట్సాప్ చాట్ బ్యాకప్ ఉండనుంది. మీ గూగుల్ అకౌంట్లో ఖాళీ స్పేస్ అయిపోతే, మీరు గూగుల్ వన్ నుంచి స్టోరేజ్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు వాట్సాప్ డేటాను బ్యాకప్ చేయగలరు.


మరోవైపు వివో వై28 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై వివో వై28 5జీ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉన్న డ్యూయల్ కెమెరా యూనిట్ అందించారు. వివో వై28 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!