WhatsApp Pin Events Feature: వాట్సాప్ గత సంవత్సరం యాప్‌కు కమ్యూనిటీ ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీని ద్వారా ఒక అంశంపై ఏర్పడిన వివిధ గ్రూపులను ఒకచోట చేర్చవచ్చు. ఉదాహరణకు స్టడీస్‌కు సంబంధించి నాలుగు గ్రూపులు ఉంటే, ఈ గ్రూపుల్లోని వ్యక్తులను ఒకే కమ్యూనిటీలోకి తీసుకురావచ్చు. ఇది అడ్మిన్ పనిని చాలా సులభతరం చేస్తుంది. అతను ప్రతి గ్రూపులో మళ్లీ మళ్లీ పోస్ట్ చేయవలసిన అవసరం లేదు. కమ్యూనిటీ ఫీచర్ కింద ఒకరి డిటైల్స్ మరొకరికి కనిపించవు. ఇది ప్రైవసీని కూడా మెయింటెయిన్ చేస్తుంది.


వాట్సాప్ కమ్యూనిటీ కోసం కొత్త ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. వాట్సాప్ అప్‌డేట్స్‌ను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ఈ సమాచారాన్ని షేర్ చేసింది. వెబ్‌సైట్ తెలుపుతున్న దాని ప్రకారం సంస్థ సంఘం కోసం 'పిన్ ఈవెంట్స్' ఎంపికపై పని చేస్తోంది.


పిన్ ఈవెంట్స్ ఆప్షన్ సాయంతో గ్రూప్‌లలో ఏదైనా ముఖ్యమైన కాల్, మీటింగ్ మొదలైనవాటిని అడ్మిన్ షెడ్యూల్ చేసినప్పుడల్లా వాట్సాప్ మీ కోసం ఆటోమేటిక్‌గా ఈవెంట్స్ కాలమ్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రయోజనం ఏమిటంటే మీరు ముఖ్యమైన మీటింగ్‌లు, కాల్స్ మొదలైనవాటిని మిస్ అవ్వరు. గ్రూప్‌లలో ఎప్పుడూ మెసేజ్‌లు రావడం వల్ల మనం వాటిని తెరవడానికి ఇష్టపడం. కొన్నిసార్లు దీని కారణంగా ముఖ్యమైన మెసేజ్‌లు కూడా మిస్ అవుతాం. వీటన్నింటినీ నివారించేందుకు వాట్సాప్ ఈ కొత్త ఆప్షన్‌పై కసరత్తు చేస్తోంది.


పిన్ ఈవెంట్స్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా వాట్సాప్ యూజర్ నేమ్, యూఐ ఛేంజ్, ఐవోఎస్ కోసం పాస్‌కీ వెరిఫికేషన్ మొదలైన వాటితో సహా అనేక కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!