Whatsapp New Feature: త్వరలో మీరు నంబర్‌లను మార్చుకోకుండానే వాట్సాప్‌లో ఒకరితో ఒకరు కనెక్ట్ కాగలరు. కంపెనీ యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది వెబ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభించింది. యూజర్ నేమ్ ఫీచర్ కింద మీరు యూజర్ నేమ్ సహాయంతో మీ వాట్సాప్‌కి ఎవరితో అయినా చాట్ చేయవచ్చు.


మీ యూజర్ నేమ్ సహాయంతో మీరు యాడ్ చేసే వ్యక్తుల కాంటాక్ట్ వివరాలను మీరు చూడలేరు. అంటే వారి మొబైల్ నంబర్ మీకు కనిపించదన్న మాట. ప్రస్తుతం ఈ ఫీచర్ వెబ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంతకుముందు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల దగ్గర కూడా కనిపించింది. టెలిగ్రామ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఉంది. టెలిగ్రామ్‌లో ఒకరితో ఒకరు ఛాట్ చేయాలంటే దానికి నంబర్ అవసరం లేదు. జస్ట్ యూజర్ నేమ్ ఉంటే సరిపోతుంది.


ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది. కేవలం యూజర్ నేమ్ ఫీచర్ మాత్రమే కాకుండా వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం స్టేటస్ అప్‌డేట్లు, డార్క్ ఇంటర్‌ఫేస్‌పై కూడా పని చేస్తోంది. త్వరలో వెబ్ వినియోగదారులు మొబైల్ లేకుండా వారి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ నుంచి నేరుగా స్టేటస్ అప్‌డేట్స్ షేర్ చేయగలరు. మీడియా మాత్రమే కాకుండా మీరు టెక్స్ట్ స్టేటస్‌ను కూడా పోస్ట్ చేయగలుగుతారు.


వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ ప్రజల ప్రైవసీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యూజర్ నేమ్ ఫీచర్ ఇతర సోషల్ మీడియా యాప్‌ల తరహాలో పని చేస్తుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన యూజర్ నేమ్ ఉంటుంది. వెబ్‌సైట్ ప్రకారం మీరు మీ యూజర్ నేమ్‌ను కూడా మార్చగలరు. అయితే దీనికి టైమ్ లిమిట్ ఎంతన్నది ఇంకా తెలియరాలేదు. అంటే ఇతర యాప్‌లలో యూజర్‌నేమ్‌ని మార్చుకోవడానికి సమయం ఉంటుంది. మీ యూజర్ నేమ్ సెట్ చేసినట్లయితే దాన్ని నిర్ణీత సమయం తర్వాత మాత్రమే మార్చగలరు. మరి వాట్సాప్‌లో కూడా ఇలాంటివి జరుగుతాయా లేదా అనేది చూడాలి.


మరోవైపు ఐకూ నియో 9 సిరీస్ ఈరోజే చైనాలో లాంచ్ అయింది. ఇందులో రెండు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అవే ఐకూ నియో 9, ఐకూ నియో 9 ప్రో మొబైల్స్. ఈ సిరీస్ ఫోన్ల‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా వీటిలో అందించారు. రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉండటం విశేషం. ప్రస్తుతానికి ఇవి చైనా దేశంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!