WhatsApp: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కంపెనీ వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. వెబ్ వెర్షన్‌తో సహా ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ యాక్సెస్ చేయవచ్చని అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో వాట్సాప్ ప్రజలకు తరచుగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇటీవల వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీనిలో మీరు ఇప్పుడు ఒరిజనల్ మీడియా ఫైల్స్‌ను పంపగలరు.


WABetaInfo కథనం ప్రకారం ఈ ఫీచర్ సహాయంతో మీరు ఇతర ఐఫోన్ వినియోగదారులకు ఒరిజినల్ క్వాలిటీతో ఫోటోలు, వీడియోలను పంపగలరు. ఇప్పటి వరకు ఐఫోన్ నుంచి ఐఫోన్‌కి పంపే ఫొటో లేదా ఫైల్ క్వాలిటీ పరంగా అసలు ఫైల్ కంటే తక్కువగా ఉంది. అయితే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ రోల్ అవుట్ తర్వాత ఐఫోన్ యూజర్లు వీడియోలు, ఫోటోల అసలు ఫైల్స్‌ను పంపగలరు.


మీరు ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించగలరు?
వాట్సాప్ ఈ ఫీచర్‌ను లాంచ్ అయిన తర్వాత మీరు ఫోటోలు, వీడియోలను డాక్యుమెంట్‌ల ద్వారా షేర్ చేయగలరు. దీని కారణంగా ఫోటోలు, వీడియోల నాణ్యత ప్రభావితం కాదు. దీన్ని ఉపయోగించడానికి, ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. దీని తర్వాత ఛాట్ ‌లో షేర్ బటన్ నొక్కాలి. తర్వాత అక్కడ డాక్యుమెంట్‌ను ఎంచుకోవాలి. మీరు ఎక్కడ నుంచి అయినా ఫోటో లేదా వీడియోని ఎంచుకోగలరు.


ప్రస్తుతం వాట్సాప్‌లో ఐఫోన్ నుంచి ఫొటోలు, వీడియోలు డాక్యుమెంట్ ద్వారా పంపడం కూడా కష్టమే. దీని కోసం ముందుగా మీరు షేర్ చేయాలనుకున్న ఫొటో లేదా వీడియోను ఫైల్స్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాటిని పెంచవచ్చు.


కొంతకాలం క్రితం వాట్సాప్ తన వినియోగదారుల కోసం చాట్ లాక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ ముఖ్యమైన చాట్‌లను హైడ్ చేయవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఈ ఫీచర్ గోప్యతను బలోపేతం చేయడంలో సహాయపడింది. లాక్ చేయబడిన చాట్‌లను దాచడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం.


ప్రస్తుతం వాట్సాప్ ప్రస్తుతం మరో కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ఇది చాట్‌లో యూజర్ ప్రొఫైల్ సమాచారాన్ని కనుగొనడంలో ఉపయోగపడుతుంది. అంటే ఆ ప్రొఫైల్‌లోని సమాచారాన్ని ఛాట్‌లో కాంటాక్ట్ వద్ద చూడవచ్చు. ప్రస్తుతానికి మొదట వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo కథనం ప్రకారం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.25.11 అప్‌డేట్‌ ద్వారా కంపెనీ ఈ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లో వినియోగదారులు ఈ ఫీచర్ ప్రయోజనాన్ని పొందుతారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!