WhatsApp: వాట్సాప్ మాతృ సంస్థ మెటా త్వరలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కోసం కూల్ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. వాట్సాప్‌లో వీడియో కాల్స్ సమయంలో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వాస్తవానికి వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా ఇటీవల ఆఫీసులో మీటింగులు కూడా జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఈ సమావేశాలు చాలా బోరింగ్‌గా మారతాయి. అటువంటి పరిస్థితిలో వాట్సాప్‌లో వీడియో కాల్స్ సమయంలో సంగీతాన్ని వినడానికి కూడా మెటా పర్మిషన్ ఇస్తుంది.
WaBetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజీలోనే ఉంది. ఇది బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులో లేదు. అయితే మెటా ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరగా డెవలప్ చేసి, టెస్ట్ చేసి ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తే బోరింగ్ మీటింగ్స్ వల్ల బాధ పడాల్సిన అవసరం ఉండదు.
ఈ ఫీచర్ ద్వారా మీరు మీటింగ్ మిస్ అవ్వరు అలాగే మ్యూజిక్‌ను కూడా. అంతే కాకుండా ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ సమయంలో కూడా మీకు సంగీతం వినిపిస్తుంది. ఇది మీకు మంచి ఆడియో, వీడియో అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసినప్పుడు వారు ఇతర వ్యక్తులతో ఆడియోను కూడా షేర్ చేయగలరు.
కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?
మీరు వీడియో కాల్‌ని స్టార్ట్ చేసినప్పుడు స్క్రీన్ దిగువన ఫ్లిప్ కెమెరా ఆప్షన్‌ను చూస్తారు. మీరు ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసినప్పుడు, వీడియో కాల్‌లో పాల్గొనే ఇద్దరూ ఆడియో లేదా మ్యూజిక్ వీడియోని ఆస్వాదించగలరు. మీరు వాయిస్ వాట్సాప్ కాల్ చేసినప్పుడు మ్యూజిక్ షేర్ ఫీచర్ పని చేయదు. ఐఫోన్ కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను అందజేస్తూనే ఉంటుంది. దీని వలన వినియోగదారులు వాట్సాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
మరోవైపు వాట్సాప్ కొంతకాలం క్రితం ఛాట్ లాక్ ఫీచర్‌ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం మీరు మీ వ్యక్తిగత ఛాట్లను ఫోల్డర్‌లో లాక్ చేయవచ్చు. లాక్ చేసిన తర్వాత వాటిని ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌తో ప్రాబ్లం ఏమిటంటే మొబైల్‌కి మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్ లాక్‌ని యాడ్ చేసినట్లయితే వారు మీ వాట్సాప్ సీక్రెట్ ఛాట్లను కూడా చూసే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు లాక్ చేసిన ఛాట్ల కోసం ఫింగర్ ప్రింట్ కాకుండా మరొక టెక్స్ట్ పాస్‌వర్డ్‌ను కూడా సెట్ చేయవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!