CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

Andhra Potoato Politics : టీడీపీ , వైసీపీ మధ్య పొటాటో అంశంపై రాజకీయం జరుగుతోంది. సీఎం జగన్ వరద బాధితులతో చేసిన వ్యాఖ్యలే ఈ రచ్చకు కారణం.

Continues below advertisement

 

Continues below advertisement

Andhra CM Jagan Potoato Politics  :  సోషల్ మీడియా కాలంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయని మరోసారి టీడీపీ, వైసీపీ నిరూపించాయి. రెండు పార్టీల మధ్య ఇప్పుడు పొటాటో అంటే అల్లిగడ్డనా.. ఉర్ల గడ్డనా అనే అంశంపై రాజకీయం జరుగుతోంది. 

సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.  బాధితులతో మాట్లాడే సమయంలో పొటాటో అంశం వచ్చింది. పొటాటో గురించి చెబుతూ ఒక కేజీ ‘ఉల్లిగడ్డ’ అని అన్నారు. వెంటనే అక్కడున్న వారు బంగాళాదుంప అని చెప్పడంతో నవ్వుకుంటూ ఐయామ్ సారీ అంటూ కవర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

 

దీంతో సీఎం జగన్‌ను టీడీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ప్రారంభించారు.  ప్రతిపక్ష పార్టీ నేతలైతే బంగాళాదుంపకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం ఉండటం ఖర్మ అంటూ విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు తెలుగు భాష సరిగా రాదని.. కూరగాయలు తెలియవని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియం పేరుతో రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు.  

 

 

మరోవైపు జగన్ తప్పులను కవర్ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.  పొటాటోను రాయలసీమలో ‘ఉల్లగడ్డ’ అని పిలుస్తారని, ఆ విషయం రాయలసీమ వాసినని చెప్పుకునే చంద్రబాబుకు తెలియకపోవడం సీమ యాస, భాష పట్ల ఏమాత్రం జ్ఙానం ఉందో అర్ధమవుతోందని ప్రతివిమర్శలు చేస్తున్నారు..

 

 

ఇందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘‘సీమలో అయితే "ఉల్ల గడ్డ" అనే అంటారు. మీ వాడికి అది తెలియదు కాబట్టే "ఉల్లి గడ్డ" అంటాడు. మళ్ళీ రాయలసీమ ముద్దు బిడ్డ అని డబ్బులిచ్చి డప్పు. మీ వాడికి సీమలో పలికే ఉల్లగడ్డ తెలియదు, ఆంధ్రాలో పలికే బంగాళదుంప తెలియదు. నీకు అసలు ఏ యాసా తెలియదు. అందుకే కాస్తో ఇస్కిస్తో లాంటి కొత్త పదాలు కనిపెట్టాడు. గడ్డ ఏదో, దుంప ఏదో తెలియకే కదా, ప్రజల నోట్లో మట్టి గడ్డలు కొట్టాడు. దమ్ము గురించి, పరదాలు కప్పుకుని తిరిగే మీరే చెప్పాలి’ అని ఎద్దేవా చేస్తున్నారు.

 

 

ప్రస్తుతం జగన్ చేసిన పొటాటో కామెంట్స్‌పై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య మాటల వార్‌కు తెరతీశాయి. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. 

Continues below advertisement
Sponsored Links by Taboola