WhatsApp Features: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌లో వినియోగదారుల సౌకర్యార్థం మళ్లీ కొత్త ఫీచర్లు రానున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. టెక్స్ట్ స్టేటస్ ఫీచర్‌లో డిజప్పియరింగ్ ఆప్షన్ రానుంది. అంటే వాట్సాప్‌లో ఏదైనా టెక్ట్స్‌ను స్టేటస్‌గా పెట్టినప్పుడు, డిజప్పియరింగ్ ఫీచర్ ఆన్‌లో ఉంటే నిర్దిష్ట సమయం తర్వాత అది డిలీట్ అయిపోతుంది.


వాట్సాప్ మెసేజ్‌ల కోసం ఇప్పటికే డిజప్పియరింగ్ మెసేజ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో కూడా లాంచ్ చేయనున్నారు. వాట్సాప్ బీటా ఐవోఎస్ 23.24.10.73 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ కనిపించిందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదించింది. వాట్సాప్ ప్రస్తుతానికి ఐఓఎస్ వెర్షన్‌కు ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో తర్వాత అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.


వాట్సాప్ చాట్‌లో 'ప్రొఫైల్ ఇన్ఫో'
వాట్సాప్ ప్రస్తుతం మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది, ఇది చాట్‌లో యూజర్ ప్రొఫైల్ సమాచారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అంటే ఆ ప్రొఫైల్‌లోని సమాచారాన్ని చాట్‌లో కాంటాక్ట్ పేరుతో చూడవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo కథనం ప్రకారం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.25.11 అప్‌డేట్‌ ద్వారా కంపెనీ కొత్త ఫీచర్లపై పని చేస్తున్నట్టు సమాచారం. అంటే రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లో వినియోగదారులు ఈ ఫీచర్ ప్రయోజనాన్ని పొందుతారు.


ఏఐ చాట్ షార్ట్‌కట్, స్టేటస్ ఫిల్టర్ కూడా
వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆధారిత చాట్ ఫీచర్ రాబోతోంది. దీని కోసం వాట్సాప్ యాప్ డిజైన్ కొద్దిగా మారుతుంది. బీటా వెర్షన్‌లో కొత్త వాట్సాప్ డిజైన్ రోల్ అవుట్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ రోల్ అవుట్ ఆండ్రాయిడ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది కాకుండా వాట్సాప్ మరో కొత్త సెక్షన్‌ను పరీక్షించడం ప్రారంభించింది. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్ విషయంలో ఈ విభాగం ప్రారంభం అయింది. వినియోగదారులు స్టేటస్‌లను ఫిల్టర్ చేసే ఆప్షన్ పొందుతారు.


అంతేకాకుండా... వాట్సాప్, గూగుల్ త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను త్వరలో ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. కానీ త్వరలో కంపెనీ దానిని 15 జీబీకి మాత్రమే పరిమితం చేయబోతోంది. అంటే మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ  ఉంటుందో అంత డేటాను మాత్రమే బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ తన అకౌంట్ స్టోరేజ్‌లో పరిగణించేది కాదు. కానీ ఇకపై అలా ఉండబోదన్న మాట. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!