Whatsapp Chat Hide: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ ఛాట్లను హైడ్ చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు హైడ్ చేసిన ఛాట్లు సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే కనిపిస్తాయి. ప్రస్తుతం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మెయిన్ స్క్రీన్‌ను స్వైప్ డౌన్ చేస్తే పైన హిడెన్ ఛాట్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకుకురానున్న ఫీచర్ ద్వారా సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే వాటిని యాక్సెస్ చేయడం సాధ్యం అవుతుంది. దీంతోపాటు వాట్సాప్ ఛానెల్స్‌కు యూజర్ నేమ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండనుంది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.24.20 బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు లాక్డ్ ఛాట్స్ లిస్ట్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న మూడు చుక్కల మెనూ ఓపెన్ చేయాలి. అందులో ఛాట్ లాక్ సెట్టింగ్స్‌కు వెళ్లి ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అక్కడ ఒక సీక్రెట్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి. ఆ సీక్రెట్ కోడ్‌ను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా కోడ్ మర్చిపోయి రీసెట్ చేయాలనుకుంటే లాక్ చేసిన ఛాట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి.
ఒకసారి మీరు లాక్డ్ ఛాట్స్‌ను హైడ్ చేసిన తర్వాత అవి లాక్డ్ ఛాట్స్ కేటగిరిలో కనిపించబోవు. సెర్చ్ బార్‌లో మీరు మీ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాటిని యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి ఈ ఫీచర్ ద్వారా మీ ప్రైవసీ మరింత మెరుగుపడనుంది.
ఒకవేళ మీరు ఇంతకు ముందు తరహాలో ఫింగర్ ప్రింట్ లాకింగ్ మెకానిజం కావాలి అనుకుంటే... హైడ్ లాక్డ్ ఛాట్స్ ఆప్షన్ డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లాక్డ్ ఛాట్లు మళ్లీ మీ మెయిన్ ఛాట్ల లిస్టులో కనిపిస్తాయి. అంటే వాటిని ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ అయితే కచ్చితంగా అవసరం అవుతుంది.
దీంతోపాటు వాట్సాప్ ఛానెల్స్‌కు యూజర్ నేమ్ అందించే ఫీచర్‌ను కూడా కంపెనీ పరీక్షిస్తుంది. ఒక్కసారి యూజర్ నేమ్ సెట్ చేశాక ఛానెల్ సబ్‌స్క్రైబర్లు యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఛానెల్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ ఫీచర్‌పై కంపెనీ ఇంకా పని చేస్తూనే ఉంది. బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో వాట్సాప్ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో కూడా వాట్సాప్‌కు 50 కోట్ల వరకు యూజర్లు ఉన్నారు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!