వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉన్న ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్, మరిన్ని అడ్వాన్స్ డ్ ఫీచర్లను పరిచయం చేయబోతున్నది. ఇప్పటికే వాయిన్ నోట్, వాయిస్ స్టేటస్, తేదీల వారీగా చాట్ సెర్చ్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు లేటెస్ట్ కెమెరా మోడ్ ను పరియం చేసింది. యూజర్లకు మరింత ఫ్రెండ్లీగా ఉండే సరికొత్త ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది.


మూడు ఆప్షన్లతో టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్


 ప్రస్తుతం వాట్సాప్ లో ఉన్న డ్రాయింగ్ టూల్ నుంచి మరింత అప్ డేట్ చేయబోతున్నది. ఇందులో కొత్తగా టెక్ట్ ఎడిటర్ అనే పేరిట ఈ ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతున్నది. ఈ టెక్ట్స్ ఎడిటర్ లో మూడు ఆప్షన్స్ ను పరిచయం చేయబోతున్నది. వీటితో వినియోగదారులు టెక్ట్స్ బ్యాగ్రౌండ్, ఫాంట్ మార్పు, టెక్ట్స్ అలైన్ మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.


త్వరలో అందుబాటులోకి రానున్న టెక్ట్స్ ఎడిటర్ ద్వారా ఫాంట్ ఛేంజ్ ఆప్షన్ తో కీ బోర్డులో తమకు నచ్చిన ఫాంట్ ను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు టెక్ట్స్ లో మార్పులు చేసుకోవచ్చు. ఫోటో, వీడియోలపై టెక్ట్స్ రాసే సమయంలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. టెక్ట్స్ అలైన్ మెంట్ తో యూజర్ తనకు నచ్చిన వైపు టెక్ట్స్ ను జరుపుకునే అవకాశం ఉంటుంది. టెక్ట్స్ బ్యాగ్రౌండ్ సైతం తమకు నచ్చినట్లుగా మార్చునే అవకాశం ఉంటుంది.






మరికొన్ని సరికొత్త ఫీచర్లపైనా వాట్సాప్ టెస్టింగ్


అటు వాట్సాప్ నుంచి మరికొన్ని ఫీచర్లు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. వాట్సాప్ ద్వారా పంపే ఫోటోలను ఒరిజినల్ సైజ్ లో పంపించుకునేలా ఓ ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ లో పంపే ఫోటోలు అస్సలు క్వాలిటీ దెబ్బ తినకుండా ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం  గ్రూప్ సబ్జెక్ట్‌లు, వివరణల కోసం అక్షరాల పరిమితిని పెంచుతోంది. గతంలో వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్ రాయడానికి  25 అక్షరాలుగా ఉన్న పరిమితిని త్వరలో 100 పదాల వరకు పెంచనుంది.






త్వరలో అందుబాటులోకి కొత్త వాట్సాప్ ఫీచర్లు


WAbetainfo నివేదిక  ప్రకారం, WhatsApp దాని Android, Ios, వెబ్ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది. త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి.      


Read Also: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?