వాట్సాప్ ఇటీవలే కొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం బిజినెస్ అకౌంట్లకు వాట్సాప్ ప్రీమియం అనే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.


WABetaInfo కథనం ప్రకారం... వాట్సాప్ ప్రీమియం అనే సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ మోడల్‌ను వాట్సాప్ బిజినెస్ కోసం మెటా డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కింద కొన్ని అదనపు సేవల కోసం బిజినెస్ అకౌంట్లు డబ్బులు చెల్లించవచ్చు.


అయితే ఈ పెయిడ్ సర్వీస్ కంపల్సరీ కాదు. వాట్సాప్ బిజినెస్‌ను ఉచితంగా ఉపయోగించుకుంటూనే అదనపు సేవల కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. వాట్సాప్ ప్రీమియం ప్లాన్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్‌లకు టెస్టింగ్‌లోనే ఉంది. ఇది ఆప్షనల్ ఫీచర్ మాత్రమే.


వాట్సాప్ ప్రీమియం మెంబర్‌షిప్ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా 10 డివైస్‌లకు కనెక్ట్ అవ్వవచ్చు. మొత్తం 10 డివైస్‌లను ప్రత్యేకంగా రీనేమ్ చేయవచ్చు కూడా. ప్రస్తుతానికి మల్టీ డివైస్ ద్వారా నాలుగు డివైస్‌ల వరకు కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది.


వాట్సాప్ ప్రీమియం సర్వీస్ ద్వారా వినియోగదారులు ప్రత్యేకమైన కస్టం బిజినెస్ లింక్ క్రియేట్ చేయవచ్చు. దీంతో వినియోగదారులు బిజినెస్ ఖాతాలను సులభంగా గుర్తించి, కమ్యూనికేట్ చేయవచ్చు. దీంతోపాటు వాట్సాప్ గ్రూపుల నుంచి సైలెంట్‌గా ఎగ్జిట్ అయ్యే ఫీచర్‌ను కూడా వాట్సాప్ త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.


అంటే మీరు వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినా ఎవరికీ నోటిఫికేషన్ రాదన్న మాట. కేవలం గ్రూపు అడ్మిన్లకు మాత్రమే ఎవరు ఎగ్జిట్ అయ్యారో తెలుస్తుంది. దీంతోపాటు వాట్సాప్ ఇటీవలే గ్రూపు సభ్యుల సైజును 256 నుంచి 512కు పెంచింది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!