వాట్సాప్ త్వరలో మెసేజ్ రియాక్షన్ల ఫీచర్లలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెసేజ్ రియాక్షన్లలో ఆరు ఎమోజీలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీటికి మరిన్ని ఎమోజీలను వాట్సాప్ యాడ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.
దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా త్వరలో రానుంది. దీని ద్వారా వినియోగదారులు మెసేజ్‌కు తమకు నచ్చిన ఎమోజీతో రియాక్ట్ అవ్వచ్చు. WABeta కథనం ప్రకారం... వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.15.7, వాట్సాప్ బీటా ఐవోఎస్ 22.14.0.71 వెర్షన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ మీకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ముందుగా మీ వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ అయ్యి ఏదైనా మెసేజ్‌కు రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.మీరు దానిపై లాంగ్ ప్రెస్ చేశాక కుడివైపు + బటన్ కనిపిస్తుందో లేదో చూడండి. ఇప్పటికే అక్కడ లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ ఎమోజీలు ఉంటాయి. + బటన్‌పై క్లిక్ చేసి కొత్త ఎమోజీలు యాడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా వినియోగదారులకు కూడా కొన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి అయితే ఎప్పుడు వస్తుందనే విషయంపై పెద్దగా ఐడియా లేదు.
వాట్సాప్ గ్రూప్స్ లోంచి సైలెంట్‌గా ఎగ్జిట్ అయిపోయే ఫీచర్‌ను కూడా కంపెనీ తీసుకువస్తుందని వార్తలు వస్తున్నాయి. మీరు లెఫ్ట్ అయితే కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే నోటిఫికేషన్ రానుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఎప్పుడు వస్తుందో చెప్పలేం.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!