WhatsApp Username Key Security: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన యూజర్ల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన, బిగ్గెస్ట్ ప్రైవసీ ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలన్నా, చాట్ చేయాలన్నా ఖచ్చితంగా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్ తోనే ఇతరులతో చాట్ చేసే సరికొత్త సదుపాయాన్ని మెటా  సంస్థ తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

Continues below advertisement

ముందే రిజర్వ్ చేసుకోండి.. నచ్చిన పేరు దక్కించుకోండి! 

ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరుతో చాలా మంది యూజర్లు ఉంటారు కాబట్టి, నచ్చిన యూజర్‌నేమ్ ఇతరుల పరం కాకముందే సొంతం చేసుకునేందుకు వాట్సాప్ ఈ వారం నుంచే గ్లోబల్ యూజర్‌నేమ్ రిజర్వేషన్  ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంవత్సరం చివర్లో ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో లైవ్ చేయబోతున్నారు. అయితే, ముందే తమకు నచ్చిన ఐడెంటిటీని లాక్ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ ముందస్తు రిజర్వేషన్ ఆప్షన్ కల్పించారు. ఒకవేళ మీకు నచ్చిన పేరు దొరకకపోతే.. యాప్‌లోనే ఉండే ప్రత్యేక  యూజర్‌నేమ్ జనరేటర్ ద్వారా ప్రత్యామ్నాయ పేర్లను వాట్సాప్ సూచిస్తుంది.   సోషల్ మీడియా హ్యాండిల్ కాదు.. కేవలం ప్రైవసీ టూల్ మాత్రమే! 

Continues below advertisement

ఈ ఫీచర్ చూడటానికి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్  తరహాలో కనిపించినప్పటికీ.. ఇది సోషల్ మీడియా నెట్‌వర్క్ కాదని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్‌లో ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ లేదా సెర్చ్ సజషన్స్ ఉండవు. అంటే, ఒక వ్యక్తి ఖచ్చితమైన యూజర్‌నేమ్ టైప్ చేస్తేనే వారి ప్రొఫైల్ కనిపిస్తుంది తప్ప, ఎవరైనా పడితే వాళ్లు సెర్చ్ చేసి వేధించడానికి వీలుండదు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ గ్రూపులు, స్కూల్ పేరెంట్స్ కమ్యూనిటీలు, ఆఫీస్ ప్రాజెక్ట్‌లు లేదా తెలియని వ్యక్తులతో గ్రూప్ చాట్లలో జాయిన్ అయినప్పుడు మీ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా దాచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.  మరో అదనపు రక్షణ.. ‘యూజర్‌నేమ్ కీ’  

ప్రైవసీని మరింత కఠినతరం చేస్తూ వాట్సాప్ ఇందులో మరో సరికొత్త సెక్యూరిటీ లేయర్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘యూజర్‌నేమ్ కీ’  . ఒకవేళ మీ యూజర్‌నేమ్ ఎవరికైనా తెలిసినా సరే, వారు మీకు మొదటిసారి మెసేజ్ చేయాలంటే మీరు సెట్ చేసుకున్న 4 అంకెల సీక్రెట్ కీ  ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కీ లేకుండా ఎవరైనా మెసేజ్ పంపితే.. ఆ మెసేజ్ నేరుగా మీ మెయిన్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా ‘రిక్వెస్ట్ ఫోల్డర్’ లోకి వెళ్తుంది. దీనివల్ల గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే స్పామ్ మెసేజ్‌లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

 యూజర్‌నేమ్‌ను ఎలా సెట్/రిజర్వ్ చేసుకోవాలి? 

ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా రోల్ అవుట్ అవుతోంది. మీ అకౌంట్‌కు ఈ ఆప్షన్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ లోపల ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది.

 స్టెప్ 1:  మొదట మీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. స్టెప్ 2: వాట్సాప్ ఓపెన్ చేసి  Settings  లోకి వెళ్లండి. స్టెప్ 3:  అక్కడ  Account పై క్లిక్ చేసి, ఆపై  Username  ఆప్షన్‌ను ఎంచుకోండి. (కొన్ని డివైజ్‌లలో ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేసినా ఈ ఆప్షన్ కనిపిస్తుంది). స్టెప్ 4: మీకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను (3 నుండి 35 అక్షరాల లోపు) టైప్ చేసి Save బటన్ నొక్కి రిజర్వ్ చేసుకోండి.

మరో విశేషం ఏమిటంటే.. మీరు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో వాడుతున్న సేమ్ యూజర్‌నేమ్‌ను మెటా అకౌంట్స్ సెంటర్   ద్వారా లింక్ చేసి, ఇక్కడ కూడా అదే హ్యాండిల్‌ను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.