History of Tamil Kadavul: సుబ్రహ్మణ్యస్వామి , మురుగన్ అనగానే తమిళులు ఎందుకు ఓన్ చేసుకుంటారు? తమిళులకు - మురుగన్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం
NTR - త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ అప్టేడ్ ఇచ్చిన నాగవంశీ కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని ట్వీట్ చేశారు. ఆ విషయం కొందరు తమిళ తంబీలకు నచ్చలేదు..మురుగన్ ఉత్తరాదిన జన్మించడం ఏంటి? మా వాడు కదా అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తమిళులకు - మురుగన్ కు ఉన్న సంబంధం ఏంటి?
తమిళ భాష - మురుగన్ మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది, ప్రాచీనమైనది. తమిళులంతా మురుగన్ ను తమిళ్ కడవుల్ ..అంటే.. తమిళుల దేవుడు అని పిలుస్తారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో మురుగన్సంఘ కాలం క్రీ.ప్రూ.300 - క్రీ.శ.300 నుంచి మురుగన్ కనిపిస్తాడు. మురుగన్ ను స్తుతించే ప్రసిద్ధ తమిళ ప్రబంధం..నక్కీరర్ రచించిన తిరుమురుగాఱ్ఱుపడైలో మురుగన్ ను 'సేయోన్' (ఎర్రని దేవుడు) అని ప్రస్తావించారు. పరిపాటల్, తొల్కాప్పియం వంటి గ్రంథాల్లోనూ మురుగన్ గురించి వివరాలున్నాయి. తమిళ భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం అన్నింటికీ అధిపతి మురుగన్.
NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి? పురాణ కథ ప్రకారం.. మురుగన్ శివుడికి గురువు పరమేశ్వరుడు ఓం అనే ప్రణవ మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడట. ఆ మంత్ర రహస్యాన్ని మురుగన్ వివరించడంతో శివుడు ఆగ్రహం ప్రదర్శించాడట. అప్పుడు మురుగన్ తండ్రికి తాను తమిళ్ భాషను బోధించానని చెప్పి సమాధానం చెప్పాడు. అందుకే తమిళులు మురుగన్ ను తమిళ్ కడవుల్, తమిళ్‌ప్పిత్తన్ అంటే తమిళ భాషా ప్రేమికుడు అని పిలుస్తారు.
చరిత్రాత్మకంగా మురుగన్ ను కురింజి అనే పర్వత ప్రాంతానికి ప్రధాన దైవమైన సేయోన్ గా పూజించేవారు. తమిళ వ్యాకరణంలో అత్యంత పురాతనగ్రంథమైన తొల్కాప్పియంలో ఈ ప్రాచీన ప్రకృతి ఆరాధన గురించి ప్రస్తావన ఉంది. శతాబ్ధాలుగా ఈ ప్రాథమిక అనుబంధం వికసించి ఆయనను తమిళ సంస్కృతికి పోషకుడిగా నిలబెట్టింది
కుమారస్వామికి నార్త్ ఇండియాలో ఆలయాలు ఉండవు ఎందుకు..? NTR-Trivikram సినిమాతో మొదలైన చర్చ!
భక్తి ఉద్యమం
తమిళ భాషాభివృద్ధికి 15వ శతాబ్ధంలో అరుణ గిరినాథర్ అనే మురుగన్ భక్తులు చేసిన సేవలు చారిత్రకరమైనవి. ఆన తమిళ సాహిత్యాన్ని, భక్తి తత్వాన్ని సుందరమైన సంగీత లయలతో ప్రజలకు చేరువ చేశారు. ఆయన రచించిన తిరుప్పుగళ్ తమిళ సాహిత్యం భక్తి, భాషా సౌందర్యానికి ఉదాహరణ. తమిళ భాషా గౌరవానికి చిహ్నం..దీని ప్రకారమే తమిళనాడు మురుగన్ ఆలయాల్లో పూజలు, అర్చనలు, భజనలు జరుగుతున్నాయి. తమిళ క్యాలెండర్ లో సుబ్రహ్మణ్య స్వామికి తైపూసం , స్కంద షష్టి, వైకాసి విశాఖం అనే ప్రత్యేక పండుగలుంటాయి. ఇంకా కావడి, కుక్కూటం వంటి ఆచారాలు కూడా పాటిస్తారు తమిళులు. తమిళనాడు, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అంతా మురుగన్ ఆలయాలున్నాయి.
మురుగన్ అంటే కేవలం తమిళ భాషకు దేవుడు మాత్రమే కాదు.. భాషా, సంసృతి, గుర్తింపునకు ప్రతీక. తమిళులకు తమ భాష అంటే ఎంత గౌరవమో..మురుగన్ అంటే అంత భక్తి.
ఆస్తి సమస్యలా? గృహ నిర్మాణం ఆలస్యమవుతోందా? ఈ ఆలయం పరిష్కార మార్గం చూపిస్తుందట!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
