Karthikeya Temples: కుమారస్వామి కథతో సినిమా రాబోతోంది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నో సందేహాలు.. అందులో ఒకటి కుమారస్వామి ఆలయాల గురించి.

Continues below advertisement

కుమారస్వామి ఉత్తరాదికి చెందినవాడు అని నాగవంశీ ట్వీట్ చేశారు. కానీ మురుగన్ కి ఆలయాలు ఎక్కువగా ఉన్నది దక్షిణాదినే. స్వామి అక్కడ జన్మించినప్పుడు అక్కడ ఆలయాలు ఎందుకు లేవు? అందుకు చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ కారణాలున్నాయా? NTR-త్రివిక్రమ్ మూవీ God Of War తో ఇది హాట్ టాపిక్ అవుతోంది.  

NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?

ఆక్రమణలు - ఆలయాల ధ్వంసం

Continues below advertisement

ఉత్తర భారతదేశం దిల్లీ సుల్తానులు, మొఘలుల పాలనలో ఎక్కువగా ఉండడంతో ఆలయాలు, విగ్రహాలు, సంస్కృతిపై ప్రభావం పడింది. ఉత్తరాదిన ఉన్న చాలా ఆలయాలు ఆ కాలంలో ధ్వంసమయ్యాయి. దక్షిణాదిన విజయనగర సామ్రాజ్యం వంటి బలమైన హిందూ రాజ్యం ఉండడంతో ఇక్కడ ఆలయాలు రక్షణ పొందాయి. కార్తికేయుడికి దక్షిణాదిన ఎక్కువ ఆలయాలు ఉండడం కూడా ఇందులో భాగమే.  

సాంస్కృతిక వ్యత్యాసాలు

దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో కుమారస్వామిని ప్రాంతీయ దేవుడిగా (కురుంజి నేల దేవుడు) భావిస్తారు. ఇక్కడ అరుపడైవీడు వంటి సంప్రదాయం ఉంది. భక్తి, కావడి, తైపూసం వంటి ఉత్సవాలు బలంగా ఉన్నాయ్. 

ఉత్తర భారతదేశంలో కార్తికేయుడిని పూజిస్తారు కానీ ఆలయాలు తక్కువ. శివుడు, శ్రీ మహావిష్ణువు, గణేషుడు, దుర్గమ్మపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. 

గుప్తుల కాలంలో కుమార గుప్త, స్కందగుప్త పూజల ప్రాచుర్యం ఉండేది కానీ ఆ తర్వాత కాలంలో తగ్గింది

ఆస్తి సమస్యలా? గృహ నిర్మాణం ఆలస్యమవుతోందా? ఈ ఆలయం పరిష్కార మార్గం చూపిస్తుందట!

సంప్రదాయాల ప్రకారం

ఉత్తరభారత దేశంలో సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మచారిగా చూస్తారు. దక్షిణంలో వల్లీదేవసేనను భార్యలుగా చూపిస్తారు. కొన్ని పురాణాల్లో కుమారస్వామి తన తల్లిదండ్రులపై అసంతృప్తితో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చేశాడనే కథలున్నాయి. 

ఉత్తర భారతంలో కుమారస్వామికి ఆలయాలు లేవా?

ఉత్తరాదిన సుబ్రహ్మణ్యస్వామికి ఆలయాలు లేవా అంటే..పూర్తిగా లేవని కాదు.. హర్యానాలో పహోవా కార్తికేయ ఆలయం ప్రాచీనమైనది. ఇది మహాభారత కాలానికి సంబంధం ఉందని నమ్మకం హిమాలయాల్లో... ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లో కార్తిక స్వామి ఆలయం ఉంది  ఇంకా ఉత్తరాదిన పలుచోట్ల స్కందుడి విగ్రహాలున్నాయి కానీ ఉపదేవతగా పూజిస్తారంతే..దక్షిణాదిలా భారీ ఆలయాలు, భక్తి ఉద్యమాలు లేవు.  

ఇది కేవలం భక్తి సంప్రదాయంలో వ్యత్యాసం మాత్రమే. దక్షిణ హిందూ సంస్కృతి సుబ్రహ్మణ్యస్వామిని ఎక్కువగా స్వీకరించింది. NTR త్రివిక్రమ్ సినిమా వల్ల మళ్లీ ఈ చర్చ జరుగుతూ...ఉత్తర-దక్షిణ సాంస్కృతిక వైభవాన్ని హైలైట్ చేస్తోంది. 

ఉత్తరాదిన - దక్షిణాదిన ఆలయాల్లో మాత్రమే కాదు... కార్తికేయుడు అంతటా ఉన్నాడు.. 

దిష్టి నుంచి రక్షించే దెయ్యం రహస్య కథ! దాని మూలం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.