WhatsApp File Sharing Feature: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం విడుదల చేశారు. టెస్టింగ్ పూర్తయిన తర్వాత రాబోయే కాలంలో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సమీపంలోని వ్యక్తులతో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా కుదురుతుంది. అంటే షేర్ఇట్ వంటి ఫైల్ ట్రాన్స్‌ఫర్ యాప్స్ కూడా అవసరం లేదన్న మాట. దీని కోసం మీరు యాప్‌లో ఫైల్స్‌ను షేర్ చేసే ఆప్షన్‌ను పొందుతారు. దాని సమీపంలోని వ్యక్తులకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.


ఫైల్స్‌ను షేర్ చేయడానికి వినియోగదారులు ఇద్దరూ ఈ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచాలి. ఫైల్‌ను ఎంచుకున్న తర్వాత యూజర్ మొబైల్‌కు ఒక రిక్వెస్ట్ వస్తుంది. అతను తన ఫోన్‌ను షేక్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉంది అంటే మీరు ఫైల్ ట్రాన్స్‌ఫర్‌లో సమస్యలను ఎదుర్కోవచ్చు.


వాట్సాప్ ఇప్పటికే చాట్ ద్వారా 2 జీబీ వరకు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే దీనికి హై స్పీడ్ డేటా అవసరం. డేటా స్పీడ్ తక్కువగా ఉంటే ఫైల్ నెమ్మదిగా డౌన్‌లోడ్ అవుతుంది. దీనికి చాలా గంటలు కూడా పడుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు కంపెనీ యాప్‌లో కొత్త ఆప్షన్‌ను తీసుకువస్తోంది.


కొత్త ఫైల్ ట్రాన్స్‌ఫర్ కింద పంపిన ఫైల్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. మీరు తప్ప దాన్ని ఎవరూ చూడలేరు. మీరు మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేయని వ్యక్తులతో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, మీ మొబైల్ నంబర్ వారికి కనిపించదు. ఇది కాకుండా కంపెనీ క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అనేక కొత్త ఫీచర్లపై కూడా పని చేస్తోంది. వీటిలో యూజర్ నేమ్ ఫీచర్ కూడా ఉంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!