Whatsapp New Update: వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. అంటే మీరు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు బ్యాకప్ తీసుకోవచ్చన్న మాట. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు మొబైల్ ఫోన్‌ను మార్చినప్పుడు, మీ డేటా సులభంగా కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్రస్తుతం మీరు గూగుల్ ఖాతాతో ఎంత డేటానైనా ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు. అంటే వాట్సాప్ ప్రస్తుతం మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్‌నను బ్యాకప్ కోసం ఉపయోగించడం లేదు. ఆండ్రాయిడ్‌లో సుమారు 5 సంవత్సరాలుగా ఛాట్ బ్యాకప్ ఉచితంగా ఉంది. వాట్సాప్ స్వయంగా స్టోరేజ్‌ను నిల్వ చేయడానికి ఉపయోగించింది. కానీ కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్ మారనుంది.
ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్‌తో మాత్రమే బ్యాకప్ చేసుకోవాలి. అంటే మీ గూగుల్ ఖాతాలో ఎంత స్టోరేజ్ ఉందో అంత మాత్రమే బ్యాకప్ అవుతుంది. గూగుల్ అకౌంట్ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు గూగుల్ నుంచి స్టోరేజ్‌ను కొనుగోలు చేయాలి. వాట్సాప్ ఇకపై మీ చాట్‌లను దాని సర్వర్‌లలో నిల్వ చేయదు.
వాట్సాప్ గత సంవత్సరం యాప్‌కి ట్రాన్స్‌ఫర్ ఛాట్స్ ఆప్షన్‌ను జోడించింది. దీని సహాయంతో మీరు మీ చాట్‌లను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీని కోసం రెండు ఫోన్‌లు ఒకే వైఫై నెట్‌వర్క్‌లో ఉండటం అవసరం. మీరు మీ గూగుల్ ఖాతాలో మాత్రమే ఛాట్‌లను బ్యాకప్ చేయాలనుకుంటే, ఛాట్ బ్యాకప్ కోసం మీరు 'Only Messages' ఎంపికను ఎంచుకోవచ్చు. ఇందులో మీ ఫోటోలు, వీడియోలు బ్యాకప్ కావు. మీ అకౌంట్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు.
ది వెర్జ్ నివేదిక ప్రకారం వాట్సాప్ ఈ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో లాంచ్ చేసింది. త్వరలో ఇది సాధారణ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా లైవ్ కానుంది. ఈ అప్‌డేట్ 2024 మొదటి అర్ధభాగంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. కంపెనీ మీకు 30 రోజుల ముందుగానే దాని గురించి సమాచారాన్ని అందించడం ప్రారంభిస్తుంది. మీరు ఛాట్ బ్యాకప్ లోపల దీని గురించిన సమాచారంతో కూడిన బ్యానర్‌ని కూడా చూడవచ్చు.
ప్రస్తుతానికి ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాపే. ఏకంగా 200 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు మెటాకు చెందిన వాట్సాప్ సొంతం. దీంతో ఈ రేసులో ముందుండటానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను పొందటానికి ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!