WhatsApp Business API New Rules: మెటా  కంపెనీకి చెందిన వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగిస్తున్న వ్యాపార సంస్థల కోసం ధరల చెల్లింపు నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి  వచ్చాయి. ఇప్పటివరకు కస్టమర్ కేర్ రెస్పాన్స్‌లు, లైవ్ ఏజెంట్ రిప్లైలు , సర్వీస్ మెసేజ్‌లు ఉచితంగా లభించగా, ఇకపై నిర్దిష్ట పరిమితి దాటిన తర్వాత పంపే ప్రతి మెసేజ్‌కు మెటా చార్జీలు వసూలు చేయనుంది. ఈ నూతన ధరల విధానం డిజిటల్ కస్టమర్ సపోర్ట్ ,  సందేశాలు పంపే ప్రతి చిన్న, పెద్ద వ్యాపార సంస్థ బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.

Continues below advertisement

కొత్త నిబంధనల ప్రకారం, వ్యాపార సంస్థలు తమ కస్టమర్ల ప్రశ్నలకు ఇచ్చే సర్వీస్ మెసేజ్‌లు నెలకు ఉచితంగా లభించే 1,000 మెసేజ్‌ల పరిమితి దాటితే చార్జీలు వర్తిస్తాయి. భారతదేశంలో ప్రతి డెలివరీ అయిన సర్వీస్ మెసేజ్‌కి దాదాపు  0.115  జీఎస్టీతో కలిపి సుమారు  0.136 పైసలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెల ఉచితంగా లభించే 1,000 మెసేజ్‌ల కోటా వ్యాపార సంస్థకు చెందిన ప్రతి ఫోన్ నంబర్‌కు విడివిడిగా వర్తిస్తుంది.

దీంతో పాటు, కస్టమర్ విచారణ విండో   ఓపెన్‌లో ఉన్న సమయంలో పంపే  యుటిలిటీ మెసేజ్‌‌లు ఆర్డర్ కన్ఫర్మేషన్, బిల్లింగ్ అప్‌డేట్‌‌లు, డెలివరీ అలర్ట్‌లు కూడా ఇకపై ఛార్జ్ పరిధిలోకి వస్తాయి. గతంలో 24 గంటల విండో వ్యవధిలో వీటిని ఉచితంగా పంపుకునే సౌలభ్యం ఉండగా, ఇకపై ప్రతి యుటిలిటీ మెసేజ్‌‌కు కూడా ప్రమాణిక చార్జీలు వర్తిస్తాయి. అయితే కస్టమర్లు వ్యాపారాలకు పంపే సాధారణ సందేశాలు యథావిధిగా ఉచితంగానే ఉంటాయి.  

Continues below advertisement

కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐ  ను వినియోగించే సంస్థలకు టోకెన్ ఆధారిత  రుసుము విధానం అమలులో ఉంటుంది. ఏఐ ప్రాసెసింగ్ మరియు మెసేజ్ డెలివరీ స్థాయిని బట్టి గ్లోబల్‌గా 1 మిలియన్ టోకెన్లకు 2 డాలర్ల చొప్పున ఛార్జ్ చేస్తారు. ఒక సాధారణ ఏఐ జెనరేటెడ్ మెసేజ్ కన్వర్జేషన్‌కు భారత కరెన్సీలో రూ. 3.8 నుండి రూ. 4.7 వరకు ఛార్జ్ పడే అవకాశం ఉంది.

వ్యాపారాలు తమ వాట్సాప్ కమ్యూనికేషన్‌లో అంతరాయం కలగకుండా ఉండటానికి ముందుగానే చెల్లింపు వివరాలను   బిజినెస్ ఖాతాలో నమోదు చేసుకోవాలని మెటా స్పష్టం చేసింది. సాధారణ వాట్సాప్ వినియోగదారులకు , ఉచితంగా లభించే  వాట్సాప్ బిజినెస్ యాప్ వాడుతున్న చిన్న వ్యాపారులకు ఈ కొత్త రుసుములు వర్తించవని, కేవలం API ఆధారిత  వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ వాడే ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలకే ఈ మార్పులు అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది.