ప్రపంచ వ్యాప్తంగా మంచి జనాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. రోజు రోజుకు పలు అప్ డేట్స్ తో  యూజర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా మరో ఫీచర్ గురించి టెస్ట్ చేస్తున్నది. అదే

     కమ్యూనిటీస్  గా పిలువబడుతుంది. కమ్యూనిటీలు ప్రాథమికంగా వాట్సాప్ గ్రూప్ చాట్‌లను కలిగి ఉన్న పెద్ద సమూహాలు. ఈ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ చాలా నెలలుగా డెవలప్ చేస్తున్నది. చక్కటి మార్పులతో దీన్ని ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్‌  లో  అందుబాటులో ఉంచింది. కమ్యూనిటీస్ అనేది గ్రూప్ లాంటిదే. కానీ కొత్త మార్పులతో వస్తుంది.  


వాట్సాప్ లో ఎక్కువ గ్రూపులను కలిగి ఉండటం మూలంగా వినియోగదారులకు ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు.. అవసరమైన దాన్ని గుర్తించడం కాస్త కష్టంగా ఉంటుంది.  అయితే, కమ్యూనిటీలు అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత  ఒకేసారి అనేక గ్రూపులకు సందేశం పంపడానికి అవకాశం ఉంటుంది. దీని మూలంగా వాట్సాప్‌ లోని కొన్ని గ్రూపులపై  అడ్మిన్‌ లకు ఎక్కువ నియంత్రణ ఉంటుందని WABetaInfo  వెల్లడించింది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం మెటా యాజమాన్యం వెల్లడించలేదు. మరోవైపు WABetaInfoలోని టెక్ ఇన్వెస్టిగేటర్స్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విషయాలతో పాటు  పరీక్షలో ఉన్న అనేక అంశాల గురించి  వెల్లడించారు.  


*మున్మముందు వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే అనేక బిజినెస్ లను సంప్రదించే ఫీచర్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.


*డిసప్పియర్ మెసేజ్ లను సేవ్ చేసే అవకాశం కల్పించబోతున్నట్లు తెలిపారు.  


*డేట్ వైస్ గా మెసేజ్ లను సెర్చ్ చేసుకునే అవకాశం ఉండబోతున్నట్లు తెలిపారు. .


*మరిన్ని ప్రైవసీ సెట్టింగులను అందిబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.   


*కొత్త కెమెరా షార్ట్‌ కట్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.  


*పెద్ద యానిమేటెడ్ ఆరెంజ్ హార్ట్ ఎమోజి వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.  


మీరు ముందుగా ఈ తాజా ఫీచర్‌ల ను ప్రయత్నించాలనుకుంటే, WhatsApp బీటాలో చేరడానికి ఈ కింది పద్దతులను పాటించండి.


WhatsApp బీటాలో ఎలా చేరాలంటే?


*మీ స్మార్ట్‌ ఫోన్ కోసం వాట్సాప్ బీటాను డౌన్‌లోడ్ చేయడానికి మీరు మీ ఆండ్రాయిడ్‌ లో Google Playకి వెళ్లి WhatsApp కోసం వెతకాలి.


*మీరు "బీటా టెస్టర్ అవ్వండి"ని కనిపించే వరకు పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి.


*నిర్ధారించడానికి "జాయిన్ టు కన్ఫామ్" బటన్‌ను నొక్కండి.


*అనంతరం "జాయిన్"ని క్లిక్ చేయండి.


*ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా యాప్ బీటా వెర్షన్‌ అప్‌డేట్ కోసం వేచి ఉండటం.


ఐఫోన్‌ లో WhatsApp బీటాలో చేరడం చాలా కష్టతరమైన విషయం.


మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా వాట్సాప్ కీలక ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఫీచర్లను రిలీజ్ చేయబోతున్నది.