ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివో వై21 స్మార్ట్ ఫోన్‌ను శుక్రవారం ఇండియాలో విడుదల చేసింది. ఇది మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిస్‌ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
వివో వై21 వేరియంట్లు, ధర..
వివో వై21 స్మార్ట్ ఫోన్ డైమండ్ గ్లో, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొత్తం రెండు వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. హైఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,490గా నిర్ణయించింది. వివో ఇండియా ఈ- స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్‌లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ల కింద దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది.
వివో వై21 స్పెసిఫికేషన్లు..
వివో వై21 స్మార్ట్ ఫోన్.. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1తో పనిచేయనుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను అదనంగా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆధారంగా పనిచేయనుంది.
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్..
ఇందులో వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. మెయిన్ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వివో వై21 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. దీని బరువు 182 గ్రాములుగా ఉంది.