మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. మొబైల్ యాప్ లేదా సైట్ ద్వారా రిఫ్రెష్ చేస్తే... 'something went wrong' లేదా 'try again' అని ఎర్రర్ వస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు.


కొంతమందికి ట్వీట్ చేయడానికి కుదరడం లేదని, మరి కొందరికి కామెంట్స్ లోడ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ట్విట్టర్ సపోర్ట్ అధికారిక పేజీ కూడా పనిచేయడం లేదు. ఆ పేజీ కూడా లోడ్ కావడం లేదని తెలుస్తోంది. ఈ అవుటేజ్‌ను మొదట డౌన్ డిటెక్టర్ గుర్తించింది.


ట్విట్టర్ డౌన్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్నిసార్లు ఇది డౌన్ అయింది. అయితే ఒకసారి రీస్టోర్ అయిన తర్వాత ట్విట్టర్ అధికారిక సపోర్ట్ హ్యాండిల్ నుంచి బ్యాక్ టు నార్మల్ నౌ అని ట్వీట్ చేశారు.