అనేక సంవత్సరాలుగా వినియోగదారులు కోరుకుంటున్న ఒక ఫీచర్‌ను ఎట్టకేలకు ట్విట్టర్ అందించనుంది. అదే ట్వీట్లను ఎడిట్ చేయడం. రాబోయే వారాల్లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల్లో కొంతమందికి ఎడిట్ బటన్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ట్వీట్‌లను పోస్ట్ చేసిన అరగంట వరకు ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే ట్వీట్‌ను ఎడిట్ చేస్తే దాని కిందనే కనిపిస్తుంది. ట్వీట్‌లో ఏం ఎడిట్ చేసినా అక్కడ కనిపిస్తుంది.


మైక్రోబ్లాగింగ్ సర్వీస్ ట్విట్టర్ అంటున్న దాని ప్రకారం, ఎడిట్ బటన్‌ను ప్రస్తుతం ఇంటర్నల్‌గా పరీక్షిస్తున్నారు. రాబోయే వారాల్లో Twitter Blue వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇతర ప్రాంతాలకు విస్తరించే ముందు ఈ ఫీచర్‌ని ఒకే దేశంలో పరీక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్విట్టర్ బ్లూ అనేది కంపెనీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్. దీని ద్వారా సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు కొత్త ఫీచర్లు అందించనున్నారు. పైన చెప్పినట్లుగా, ఎడిట్ బటన్ ద్వారా వినియోగదారులు తమ ట్వీట్లను 30 నిమిషాల వ్యవధిలో ఎడిట్ చేసుకోవచ్చు.


ట్విట్టర్ ఎడిట్ బటన్: ఉపయోగం ఏంటి?
ట్విట్టర్ తెలుపుతున్న దాని ప్రకారం... ట్వీట్ ఎడిట్ చేసినట్లు ఐకాన్, దానికి సంబంధించిన టైమ్‌స్టాంప్, లేబుల్‌తో స్పష్టంగా తెలుస్తుంది. వినియోగదారుడు ఆ లేబుల్‌పై క్లిక్ చేసినప్పుడు, ట్వీట్ ఎడిట్ హిస్టరీ కనిపిస్తుంది. ఇందులో గత మార్పులు, అసలు ట్వీట్ ఉంటాయి. సంభాషణల సమగ్రతను కాపాడేందుకు, ప్లాట్‌ఫారమ్‌లో స్టేట్‌మెంట్‌ల పబ్లిక్ రికార్డ్‌ను నిర్వహించడానికి ఇలా చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


అయితే దీని వల్ల ప్రయోజనం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ట్వీట్‌ను ఎడిట్ చేయడానికి గల ముఖ్య కారణం అందులో ఉన్న తప్పును సరి చేయడం. ఆ తప్పు తిరిగి కనిపించకూడదంటే ట్వీట్ డిలీట్ చేసి మళ్లీ చేయడం బెస్ట్.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!