సోనీ XR-85X95K అల్ట్రా హెచ్‌డీ మినీ ఎల్ఈడీ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. సోనీ ఫ్లాగ్‌షిప్ ఎక్స్95కే టీవీ రేంజ్‌లో ఇది లాంచ్ అయింది. ఏకంగా 85 అంగుళాల భారీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. మోస్ట్ పవర్ ఫుల్ సోనీ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్‌పై ఈ టీవీ పనిచేయనుంది.


సోనీ ఎక్స్ఆర్-85కే95కే మినీ ఎల్ఈడీ టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.8,99,900గా నిర్ణయించారు. అయితే బెస్ట్ బై ఆప్షన్ కింద రూ.6,99,900కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. సోనీ సెంటర్ స్టోర్లు, పెద్ద ఎలక్ట్రానికి రిటైలర్లు, ఈ-కామర్స్ పోర్టల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతో టీసీఎల్ ఫ్లాగ్ షిప్ టీవీలతో సోనీ కూడా పోటీ పడనుంది.


సోనీ ఎక్స్ఆర్-85కే95కే మినీ ఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
పైన చెప్పినట్లు ఇందులో 85 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఈ టీవీలో ఉంది.


హై డైనమిక్ రేంజ్ కంటెంట్‌ను ఎక్స్ఆర్-85కే95కే మినీ ఎల్ఈడీ టీవీ సపోర్ట్ చేయనుంది. డాల్బీ విజన్ ఫార్మాట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీలో ఉన్న కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా టీవీలో ఉన్న అడ్వాన్స్‌డ్ మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైటింగ్‌ను కంట్రోల్ చేయవచ్చు.


ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్‌వేర్‌పై ఈ టీవీ పని చేయనుంది. గూగుల్ టీవీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇందులో అందించారు. వాయిస్ కంట్రోల్స్‌కు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, యాపిల్ ఎయిర్‌ప్లే, యాపిల్ హోం కిట్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీంతోపాటు సిక్స్ స్పీకర్ అకోస్టిక్ మల్టీ ఆడియో సెటప్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 60W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ టీవీ అందించనుంది.


ఇటీవలే సోనీ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లలో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్, గూగుల్ కంపెనీలకు సోనీనే సెన్సార్లు అందిస్తుంది. అయితే ఈ 100 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.


ప్రస్తుతం శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందించే పనిలో ఉంది. దీనికి ఐసోసెల్ హెచ్‌పీ3 అని పేరు పెట్టనున్నారు. 2023లో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్‌లో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న దాని ప్రకారం సోనీ ఐఎంఎక్స్8 సిరీస్‌లో ఈ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండనుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు అందుబాటులో ఉన్న పెద్ద సెన్సార్లలో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే 108 మెగాపిక్సెల్ సెన్సార్లను లాంచ్ చేసింది.


సోనీ ఐఎంఎక్స్8 సెన్సార్‌తో పాటు ఐఎంఎక్స్9 సెన్సార్లపై కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం దాదాపు ఒక అంగుళం సైజు ఉన్న 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా సోనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. దీనికి ఐఎంఎక్స్989 అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!