టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది తక్కువ ధరలు చక్కటి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి వినియోగదారులను టార్గెట్ చేసుకుని తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి పలు స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు. మంచి బ్యాటరీ, చక్కటి స్టోరేజ్ కలిసి ఉండి , రూ. 12 వేల లోపు లభించే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  


1. Realme Narzo N53 - రూ. 8,999


Realme Narzo N53 మంచి డిజైన్ తో పాటు చక్కటి స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.  ఇది 33W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ 6.74-అంగుళాల 90Hz డిస్‌ప్లేతో వస్తుంది. శక్తివంతమైన ఆక్టా-కోర్ చిప్‌ సెట్‌ను కలిగి ఉంది. ఎక్స్ పాండబుల్ మెమరీతో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో 8MP AI సెల్ఫీ కెమెరాతో 50MP AI వెనుక కెమెరాను కలిగి ఉంది. ఈ  స్మార్ట్‌ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 4GB+64GB ధర రూ.8,999 కాగా, 6GB+ 128GB ధర రూ.10,999. ఈ ఫోన్ ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.


2. Poco C55 - రూ. 11,999


Poco C55 6.71-అంగుళాల HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.  ఇది MediaTek Helio G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.  50MP డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్, కూల్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తుంది.


3. Redmi A1+ - రూ. 9,999


Redmi A1+ అనేది పాకెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. MediaTek Helio A22 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.52-అంగుళాల HD+ ఇమ్మర్సివ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మంచి కెమెరా సెటప్ తో వస్తుంది. 8MP డ్యూయల్ AI బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. Redmi A1+ నలుపు, లేత నీలం,  లేత ఆకుపచ్చ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది.


4. Samsung Galaxy A03 కోర్ - రూ. 10,499


 Samsung Galaxy A03 కోర్ 5000mAh బ్యాటరీ కలిగి ఉన్న సరసమైన స్మార్ట్‌ ఫోన్. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6.5-అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఐదు రంగులలో లభిస్తుంది.


5. Lava Blaze 5G - రూ. 11,499


Lava Blaze 5G ఇటీవలే 6GB వేరియంట్‌లో విడుదల అయ్యింది. ఇది గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది.  గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ రంగులలో లభిస్తుంది. ఇది MediaTek Dimensity 700 చిప్‌ సెట్‌ ను కలిగి ఉంటుంది.  50 MP AI ట్రిపుల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.  90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.


Read Also: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!