Valentine Day Gifts: ఎవరికైనా మీరు ఇచ్చే బహుమతి మీ మనస్తత్వాన్ని అవతలివారీపై మీకు ఉండే ప్రేమను తెలియజేస్తుంది. నార్మల్ రోజుల్లో ఇచ్చే బహుమతులకు ప్రేమికుల రోజు ఇచ్చే బహుమతులకు చాలా వైవిధ్యం ఉంటుంది. అందుకే వాలంటైన్ డే సందర్భంగా ఇచ్చే బహుమతుల కోసం చాలా రకాల ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు చేసే వారి కోసం కొన్ని టెక్‌ బహుతులు గురించి మీకు తెలియజేస్తున్నాం. 

ప్రేమికులు పువ్వులు, టెడ్డీబేర్‌లు, చాక్లెట్లు ఇచ్చుకోవడం చాలా సాధారణం. ఇది పాత పద్ధతే అయినా నేటికీ ట్రెండీగానే ఉంటోంది. దీన్ని తీసి పారేయలేం. అలాగని వాటినే గిఫ్ట్‌లుగా ఇస్తే జెన్‌జీలో చెల్లుబాటు కాదు. అందుకే కాస్త కొత్తగా ఉండేందుకు మీరు టెక్‌సావీలా ఆలోచించి గిఫ్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇప్పుడు చెప్పే లిస్ట్ నుంచి కొన్ని బహుమతులను ఎంపిక చేసుకొని మీ ప్రియమైన వారి మనస్థత్వాన్ని అర్థం  చేసుకొని వారికి ఇష్టమైన వాటిని కొనుగోలు చేయండి. మీరు ఇచ్చే గిఫ్ట్ అవతలి వాళ్లకు నచ్చడమే కాకుండా మీరు నిత్యం అందులో కనిపించేలా ఉండాలి. 

స్మార్ట్‌ వాచ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న గిఫ్ట్‌. మీకు ఇష్టమైన వారికి అనుక్షణం దగ్గర ఉండేలా చేసే బహుమతి స్మార్ట్ వాచ్. దీన్ని ధరించినప్పుడల్లా మీరు వాళ్ల మనసులో మెదులుతూనే ఉంటారు. సమయానికి తినేలా, పని పూర్తి చేసి విశ్రాంతి తీసుకునేలా, వారి రోజు వారిపనులు సమయానికి పూర్తి అయ్యేలా చేయవచ్చు. హాట్‌బీట్‌ను, నిద్రను మానిటర్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటేలా చేస్తుందీ స్మార్ట్ వాచ్. 

ఈ స్మార్ట్ వాచ్ అందరికి అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తోంది. ఇప్పుడ వాలంటైన్ డే సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ ఆఫర్‌లు కూడా పెట్టాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు రేంజ్ ఏంటో తెలుసుకొని ఓ గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చేయండి. 

స్మార్ట్ రింగ్ ప్రియమైన వారి ఆరోగ్యాన్ని శ్రేయస్సును కోరుకునే వాళ్లు ఈ స్మార్ట్ రింగ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఇది ధరించిన వారి ఆరోగ్యాన్ని నిత్యం గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేయాలో షెడ్యూల్ చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ మాదిరిగానే ఇందులో చాలా రకాల డిజైన్లు వచ్చాయి. ఆఫర్‌లు కూడా ఉన్నాయి. 

ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్‌మీ ప్రియమైన వారికి ప్రేమతో ఇయర్ బడ్స్, లేదా హెడ్‌ఫోన్స్ బహుమతిగా ఇవ్వవచ్చు. వారు రిలాక్స్ అయ్యేందుకు సహకరించవచ్చు. వర్కౌట్స్ అయ్యేటప్పుడు పాటలు వినడానికి మీతో మాటలు చెప్పడానికి ఇది లాభిస్తుంది. దీని వల్ల ఇతర వినికిడి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రీమియర్ బ్లాండ్‌లను ఎంచుకోవడం బెటర్ లేకుండా అవతలి వాళ్లకు చేటు చేసిన వాళ్లు అవుతారు. 

మొబైల్ కేస్ మొబైల్ కేస్‌ చూడటానికి చాలా తక్కువ ఖరీదులా అనిపించినా ప్రియమైన వారి చేతులో ఎప్పుడూ ఒదిగిపోయేందుకు ఇదో మంచి అవకాశం, మంచి కొటేషన్‌తో ఇచ్చే ఈ గిఫ్ట్‌ అవతలి వారి చేతిలో ఎప్పుడూ ఉంటుంది. వారికి నచ్చిన ఫొతో కలిపి కొటేషన్ రాసి ఇవ్వగలిగితే  మరీ మంచింది. ఇది టెక్ గిఫ్టు కాకపోయినా దానికి రిలేటెడ్‌గా చెప్పుకోవచ్చు. 

Also Read: రోజ్​ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇవే.. మీ వాలెంటైన్​కి రోజ్​ డే విషెష్​ ఇలా చెప్పేయండి

పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్స్ ప్రతి ఇంటిలో కనిపిస్తున్న డివైస్ ఇది. నచ్చిన వారికి ఈ బ్లూటూత్ స్పీకర్స్ కొనివ్వగలిగింతే మంచి గిఫ్ట్ అవుతుంది. వాళ్లు ఇంటికెళ్లిన తర్వాత రిలాక్ష్ అవ్వడానికి నచ్చిన పాటలు వింటారు. ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్తారు. వారితో ఆ డివైస్ ఉన్నంత సేపు మీరే ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతారు. 

ఫొటో ఫ్రేమ్‌ఒకప్పుడు చాలా పంక్షన్స్‌లో ఇచ్చే గిఫ్టే కావచ్చు. కానీ నేటి తరానికి తగ్గట్టుగా అప్‌డేట్ అయితే అదిరిపోయే గిఫ్ట్ ఇది. ఈ మధ్య డిజిటల్ ఫొటో ప్రేమ్‌లు వస్తున్నాయి. అందులో మీకు నచ్చిన ఫొటోలు స్లైడ్ అవుతూ ఉంటాయి. అందుకే ప్రియమైన వారికి నచ్చిన ఫొటోలు యాడ్ చేసి ఈ డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌ను ప్రేమతో అందివ్వండి. 

Also Read: హ్యాపీ ప్రపోజ్ డే 2025.. చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే, ప్రపోజ్ చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి

ఇన్‌స్టెంట్‌ ఫొటో కెమెరా  ఇన్‌స్టెంట్‌ ఫొటో కెమెరా ఈ మధ్య బాగా ట్రెండీగా మారింది. అప్పటకప్పుడు ఫన్నీ సన్నివేషాలను ఫొటోల్లో బంధించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఇది కాస్ట్లీ అయినా మంచి బహుమతిగానే చెప్పవచ్చు. ఇందులో తీసిన ప్రతి ఫోటోలో మీకు తెలియకుండానే మీ పేరు రాసి ఉంటుంది. కలకలాం గుర్తుగా నిలుస్తుంది. 

స్ట్రీమింగ్ సర్వీస్ సబ్‌స్క్రిప్సన్స్ట్రీమింగ్‌ యాప్‌లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇతర కంటెంట్ చూడటం అలవాటుగా మారింది. అందుకే ఏదైనా మంచి సబ్‌స్క్రిప్సన్ కూడా ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇయ్యవచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చే గిప్ట్ వచ్చే ఏడాది వాలంటైన్స్ డే వరకు గుర్తుంటుంది.  

మినీ ప్రొజెక్టర్ సినిమాలకు వెళ్లడం తగ్గించేశారు. యాప్‌ సబ్‌స్క్రిప్సన్ తీసుకొని వాటిలోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. అలాంటివి బిగ్ స్క్రీన్‌లో చూస్తే ఎలా ఉంటుంది. అందుకే ఆ అనుభూతి కల్పించేందుకు మినీ ప్రొజెక్టర్‌ను కొని ఇయ్యవచ్చును. దీంతో మీ లవర్‌ హ్యాపీగా లేటెస్ట్ రిలీస్ సినిమాలుథియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో చూస్తారు.