స్మార్ట్‌ఫోన్ బాగా సాగడంలో స్టోరేజీకి పెద్ద పాత్ర ఉంటుంది. మెమరీ నిండితే స్మార్ట్‌ఫోన్ పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అటువంటి పరిస్థితిలో, స్మార్ట్ ఫోన్‌లొ తగినంత మెమరీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ స్మార్ట్‌ఫోన్ నిండినట్లయితే, మీరు మీ వాట్సాప్‌లో ఉన్న అనవసరమైన ఫోటోలు, వీడియోలను తొలగించవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ మెమరీలో స్టోరేజ్‌ను క్రియేట్ చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ బాగా పని చేయడం ప్రారంభిస్తుంది.


ఇన్‌బిల్ట్ స్టోరేజ్ టూల్ ఉపయోగకరంగా ఉంటుంది
1. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాక మీరు స్టోరేజ్ మేనేజర్‌ని ఉపయోగించి, ఏ ఫైల్‌లో ఎంత స్టోరేజ్ ఉందో చూసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఉపయోగం లేని ఫైల్స్‌ను తొలగించవచ్చు.
2. దీని కోసం వాట్సాప్ యాప్‌లోకి వెళ్లండి. ఇప్పుడు యాప్ హోమ్ స్క్రీన్‌లోని మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై సెట్టింగ్స్‌కు వెళ్లండి.
3. దీని తర్వాత ‘Storage and Data’పై క్లిక్ చేసి, ఆపై ‘Manage Storage’పై క్లిక్ చేయండి.
4. ఇలా చేయడం ద్వారా వాట్సాప్ ఉపయోగించే స్టోరేజ్ వివరాలు, మీడియా సైజ్ ప్రకారం చాట్ లిస్ట్ కనిపిస్తుంది.
5. ఎక్కువ స్టోరేజ్ తీసుకున్న ఫైల్స్‌ను ఇక్కడ చూడండి. అక్కడ మీరు వాటిని డిలీట్ చేయవచ్చు.


చాట్ సెట్టింగ్స్ నుండి తొలగించే ఆప్షన్ కూడా ఉంది
చాట్ సెట్టింగ్స్‌కు వెళ్లడం ద్వారా మీడియా ఫైల్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. చాట్ స్క్రీన్‌పై వచ్చే మూడు చుక్కలపై క్లిక్ చేయండి లేదా ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా చాట్ సెట్టింగ్‌లకు వెళ్లండి. అక్కడ Media, Links, Docs ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల చాట్‌లో షేర్ చేసిన మీడియా ఫైల్స్ అన్నీ ఒకే చోటకు వస్తాయి. ఇక్కడ మీరు ఫైల్‌లను ఎంచుకుని తొలగించవచ్చు.


గ్యాలరీ నుంచి కూడా డిలీట్ చేయవచ్చు
స్మార్ట్‌ఫోన్ గ్యాలరీకి వెళ్లి వాట్సాప్ ఫోటోలను కూడా తొలగించవచ్చు. ఇది కాకుండా మీరు గూగుల్ ఫోటోస్‌కు వెళ్లి వాట్సాప్ ఫోటోలను కూడా తొలగించవచ్చు. దీని కోసం గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేసి, ఆపై లైబ్రరీకి వెళ్లండి. అక్కడ మీరు తొలగించాల్సిన ఫోటోలు, వీడియోలను ఎంచుకోండి. తొలగించడానికి మూవ్ టు ట్రాష్ ఎంపికపై క్లిక్ చేయండి. ఈ ఫైల్‌లను పర్మినెంట్‌గా డిలీట్ చేయడానికి లైబ్రరీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ట్రాష్‌కు వెళ్లి మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఫైల్స్‌ని ఎంచుకుని, ఆపై ‘డిలీట్ పర్మనెంట్‌’పై క్లిక్ చేయండి.


మరోవైపు వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి ఇది ప్రో వెర్షన్. వన్‌ప్లస్ ఏస్ 2లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ ఏస్ 2 సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో దీనికి సంబంధించిన అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయి.








Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!