Fastest 100 million Signups: ప్రపంచంలో ఏ సర్వీస్‌కి అయినా, ఏ బిజినెస్‌కి అయినా యూజర్ బేస్ అనేది చాలా ముఖ్యం. అలాగే సోషల్ మీడియా సర్వీసులకు ఈ యూజర్ బేస్ ప్రాణం లాంటిది. ఎంత ఎక్కువ యూజర్ బేస్ ఉంటే అంత ఎక్కువ ఆదాయం అన్నమాట.


ట్విట్టర్ పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ట్విటర్ లాగా పనిచేస్తుంది కానీ దీనికి కాస్త భిన్నంగా ఉంటుంది. 100 మిలియన్ యూజర్లను పొందడానికి థ్రెడ్స్ యాప్‌కు కేవలం ఐదు రోజులు మాత్రమే పట్టింది. అంటే కేవలం 120 గంటల్లోనే కోటి మంది ఈ యాప్‌ని ఉపయోగించారన్న మాట.ఇతర ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు 100 మిలియన్ యూజర్ బేస్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.


మనందరం ఇప్పటికే ఏఐ గురించి విని ఉంటాం. గత సంవత్సరం లాంచ్ అయిన ఛాట్‌జీపీటీ ఏఐ ఛాట్ బోట్ 100 మిలియన్ యూజర్‌బేస్‌ను చేరడానికి రెండు నెలల వరకు సమయం పట్టింది. ఛాట్‌జీపీటీ గతేడాది నవంబర్‌లో మొదటగా లాంచ్ అయింది. జనవరిలో ఛాట్‌జీపీటీ ట్రాఫిక్ 100 మిలియన్లను దాటింది.


చైనాకు చెందిన TikTok యాప్ 100 మిలియన్ల యూజర్‌బేస్‌ను సాధించడానికి 9 నెలలు పట్టింది. అదే చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా, పేమెంట్ యాప్  వుయ్ ఛాట్ (WeChat) 100 మిలియన్ల ప్రేక్షకులను చేరుకోవడానికి 14 నెలల సమయం పట్టింది. గూగుల్‌కు చెందిన గూగుల్ ప్లస్‌కు కూడా సరిగ్గా ఇన్ని నెలలే పట్టింది కానీ ఆ సర్వీసును కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.


మెటాకు చెందిన ప్రసిద్ధ సోషల్ మీడియా యాప్స్ ఇన్‌స్టాగ్రామ్‌కు 100 మిలియన్ యూజర్ బేస్‌ను పొందడానికి రెండు సంవత్సరాల ఆరు నెలలు, వాట్సాప్‌కు ఇదే మార్కును అందుకోవడానికి మూడు సంవత్సరాల ఆరు నెలలు పట్టింది. థ్రెడ్స్ యాప్ అయితే కేవలం ఐదు రోజుల్లోనే ఈ మార్కును అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ చేయడమే దీనికి కారణం.


100 మిలియన్ల యూజర్లను పొందడానికి ఐఫోన్‌కు మూడు సంవత్సరాల ఏడు నెలలు పట్టింది. స్నాప్‌‌చాట్‌కు మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు, యూట్యూబ్‌కు నాలుగు సంవత్సరాల ఒక నెల సమయం పట్టింది. ఇక ఫేస్‌బుక్‌కు అయితే నాలుగు సంవత్సరాల ఆరు నెలలు పట్టింది. ట్విట్టర్‌ ఏకంగా ఐదు సంవత్సరాల ఐదు నెలలు, వరల్డ్ వైడ్ వెబ్‌ (WWW) ఏడు సంవత్సరాల సమయాన్ని 100 మిలియన్ యూజర్ల మార్కుకు చేరుకోవడానికి తీసుకున్నాయి. 










Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial