Telugu Space Travellers: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా.. అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. భారత గగనయాన్ వ్యోమగాముల్లో కరైన శుభాన్ష్ ఇప్పటికే భూ కక్ష్యలో ఉన్నారు. అంతకు ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేశ్ శర్శ, ఇండియన్ అమెరికన్స్ కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ కూడా స్పేస్‌లోకి వెళ్లారు. అయితే భారతీయ పౌరుడిగా నాసాకు సంబంధించిన స్సేస్ మిషన్‌లో అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడు శుభాన్ష్. మన భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టిన అరుదైన సందర్భంలో వినువీధిలో మన వాళ్లు సత్తా గురించి మాట్లాడుకుందాం
గగన వీధిలో ఘన చరిత్ర..
అనేక రంగాల్లో సత్తా చాటే మన తెలుగువాళ్లు.. అంతరిక్షంలోనూ అడుగుపెట్టారు. రోదసీయాత్రలు.. ఆకాశయానంలో భారత్ ఇంకా అంత ముందడుగు వేయలేదు కానీ.. NASA ద్వారా మన భారతీయులు అంతరిక్షయానం చేశారు. అయితే…Space Exploration ఎక్కువుగా జరిగే అమెరికాలో అనేక రూపాల్లో అంతరిక్షానికి వెళ్లొచ్చు. అలా ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు భూమిని అంతరిక్షం నుంచి చుట్టేశారు. ఇప్పుడు మరొకరు దానికి సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ స్పేస్ మిషన్ల ద్వారా రెండు యాత్రలు పూర్తయ్యాయి. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి 2029లో ఆస్ట్రోనాట్‌గా వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారంటే..
భూమిని చుట్టేసిన బండ్ల శిరీష
బండ్ల శిరీష.. గుంటూరమ్మాయి.. తెనాలికి చెందిన బండ్ల అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయ మహిళ. సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వెళ్లినప్పటికీ సునీత అమెరికన్ ఇండియన్. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షానికి వెళ్లింది బండ్ల శిరీషనే.. చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న శిరీష తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి యుఎస్‌లోని హ్యూస్టన్‌కు వెళ్లిపోయారు. అక్కడే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మాస్టర్స్ చేసిన శిరీష.. Virgin Galactic అనే స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సంస్థలో చేరారు. ప్రస్తుతం ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. Virgin Galactic Unity 22 స్పేస్ మిషన్‌లో స్పేస్ టూరిస్ట్‌గా వెళ్లారు. Unity 22 , 2021లో భూమి సబ్ ఆర్బిటల్ స్పేస్‌కు వెళ్లింది. జీరో గ్రావిటీని ఫేస్ చేసిన రెండో భారతీయ మహిళగా.. తొలి తెలుగు వ్యక్తిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించారు.
గగనయానం చేసిన తోటకూర గోపీచంద్..
మన వాళ్ల అంతరిక్ష యానం శిరీషతోనే ఆగలేదు. బెజవాడకు చెందిన గోపీచంద్.. కూడా స్పేస్ యాత్రను చేశాడు. అమేజాన్ అధిపతి Jeff Bezos కు చెందిన Blue Origin న్యూషెపర్డ్ 25 వ్యామనౌకలో అంతరిక్ష యానం చేశారు. కమర్షియల్ పైలట్ అయిన గోపీచంద్.. యుఎస్‌లో ఓ వెల్‌నెస్ కంపెనీని నిర్వహిస్తున్నారు. 2024 ఆయన న్యూషెపర్డ్ క్రూతో కలిపి ఈ యాత్ర చేశారు.
జాహ్నవి దంగేటి కొత్త చరిత్ర – స్పేస్‌లోకి వెళ్లనున్న తొలితెలుగు ఆస్ట్రోనాట్
పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అనే 23 ఏళ్ల అమ్మాయి.. 2029లో అంతరిక్షంలోకి వెళ్లనుంది. U.S కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ Titan Space Industries -TSI 2029లో చేపట్టే స్పేస్ మిషన్‌లో జాహ్నవి Astronaut Candidate ASCAN గా ఎంపికైంది. అంతకంటే ముందే ఆమె NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఇప్పటివరకూ స్పేస్‌కు వెళ్లిన మన వాళ్లు అంతరిక్ష యాత్రికులు Space Tourists మాత్రమే. కానీ జాహ్నవి ఓ Austronaut గా వెళ్లనుంది. మూడేళ్ల పాటు ఆమె Titan Space వ్యోమగామి శిక్షణ తీసుకోనుంది.
తెలుగు విద్యార్థులకు STEM సబ్జెక్టుల్లో మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. మిగతా రాష్ట్రాల విద్యార్థులతో పోలిస్తే.. సౌత్‌లో అందునా.. ఏపీ, తెలంగాణలో సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. IITల్లో చేరినా.. అమెరికాకు మాస్టర్స్‌కు వెళ్లేవాళ్లలోనూ.. తెలుగు వాళ్లు ఎక్కువుగానే ఉంటారు. ఆ ఆసక్తే మనవాళ్లు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ చేయడానికి దోహదం చేస్తోంది. ఆకాశం అంచులను అందుకోవాలన్న తపనతో వీరంతా Space Exploration చేస్తున్నారు