IISER IAT Results 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) IISER ఆప్టిట్యూడ్ టెస్ట్ (IAT) 2025 ఫలితాలు ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iiseradmission.inలో పూర్తి వివరాలు ఉంచారు. అందులోకి లాగిన్ అయిన తర్వాత స్కోర్ కార్డులు పొందవచ్చు. అక్కడ ఫలితాలను కూడా చూడవచ్చు. దరఖాస్తుదారులు రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
IISER సంస్థలు అందించే BS, BS-MS (డ్యూయల్ డిగ్రీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి ప్రవేశం కోసం నిర్వహించే IISER IAT 2025 మే 25 చేపట్టారు. పరీక్ష పూర్తైయన తర్వాత IAT 2025 సమాధాన కీ మే 26న విడుదల చేశారు. అభ్యంతరాల విండో మే 29 నుంచి జూన్ 1, 2025 వరకు ఓపెన్ చేశారు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iiseradmission.inలోకి వెళ్లిన తర్వాత హోమ్‌పేజీలోని 'IAT 2025 Results' లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ వివరాలు అడుగుతుంది. వాటిని ఇచ్చిన తర్వాత ఫలితాలు చూసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. స్కోర్ కార్డును అభ్యర్థులు ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు చూపించాలి.
ఫలితాల ప్రకటనతోపాటు, IISER కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి కూడా అభ్యర్థులకు తెలియజేసింది. IISER అకడమిక్ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ ఫారమ్ పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ విండో జూన్ 26 (సాయంత్రం 5) నుంచి జులై 3 (సాయంత్రం 5) వరకు ఓపెన్ చేసి ఉంచుతారు
ఫలితాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నందున, విజయవంతమైన అభ్యర్థులు త్వరలో IISER 2025 అడ్మిషన్ ప్రక్రియను తెలిజేయనున్నారు. ఇందులో భారతదేశంలోని ప్రముఖ సైన్స్ విద్య,పరిశోధనా సంస్థలలో అడ్మిషన్ పొందడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపు ఫార్మాలిటీలు ఉంటాయి.