Tecno Pova 6 Pro 5G Launched: టెక్నో పోవా 6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మొదట పరిచయం చేశారు. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఫోన్ వెనకవైపు 1080 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో రెండు ర్యామ్ వేరియంట్లు అందించారు. దీనికి సంబంధించిన సేల్ వచ్చే నెలలో జరగనుంది.


టెక్నో పోవా 6 ప్రో 5జీ ధర (Tecno Pova 6 Pro 5G Price)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.21,999గా నిర్ణయించారు.


ప్రారంభ ఆఫర్ కింద దీన్ని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది. అంటే దీని టాప్ ఎండ్ వేరియంట్ కూడా రూ.19,999కే కొనేయచ్చన్న మాట. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4,999 విలువైన టెక్నో ఎస్2 స్పీకర్‌ను ఉచితంగా అందించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


టెక్నో పోవా 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Pova 6 Pro 5G Features)
ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కనాుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని వర్చువల్‌గా మరో 12 జీబీ పెంచుకోవచ్చు. 8 జీబీ ర్యామ్ వేరియంట్లో 8 జీబీ వరకు మాత్రమే పెంచుకునే ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా 6 ప్రో 5జీ పని చేయనుంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మరో ఏఐ ఆధారిత లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ లెన్స్ అందుబాటులో ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్‌లో డైనమిక్ పోర్టు 2.0 ఫీచర్ అందుబాటులో ఉంది. డిస్‌ప్లేలో కెమెరా ఉండే పంచ్ హోల్ కటౌట్ ప్రాంతంలో ఛార్జింగ్, కాల్ వివరాలు, ఇతర అలెర్ట్స్ కనిపిస్తాయి. అప్‌డేటెడ్ ఆర్క్ ఇంటర్‌ఫేస్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని ద్వారా ఫోన్ వెనకవైపు ఉన్న ఎల్ఈడీలను కస్టమైజ్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు కూడా టెక్నో పోవా 6 ప్రో 5జీలో ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?