Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!

మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు.

Continues below advertisement

రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి పని ఫోన్ ద్వారానే జరిగిపోతోంది. ఇక వాట్సాప్ గురించి  పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన సమాచారం అంతా వాట్సాప్ చాట్ ద్వారానే  చక్కబెట్టుకుంటున్నారు. ఫోటోలు, డాక్యుమెంట్స్ లాంటి  కీలకమైన డేటాను కూడా షేర్ చేసుకుంటారు. ఒక్కోసారి ఫోన్ పోవడం, లేదంటే దొంగిలించబడటం వల్ల ముఖ్యమైన డేటాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు, కానీ, డేటా రికావరీ అనేది కాస్త కష్టమైన పని. అయినా,  మీ స్మార్ట్‌ ఫోన్ దొంగిలించబడినట్లయితే వాట్సాప్ చాట్‌లను తిరిగి పొందేందుకు కొన్ని పద్దతులు పాటిస్తే సరిపోతుంది.   

Continues below advertisement

అదే ఫోన్ నంబర్‌తో కొత్త SIMని పొందండి

1. మీ ఫోన్ దొంగిలించబడిన వెంటనే, మీ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్లి మీ SIM కార్డ్‌ని బ్లాక్ చేయమని అడగండి. SIM కార్డ్‌ ను లాక్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ సేవలను మరే ఇతర ఫోన్‌లో  ఉపయోగించకుండా చూసుకోవచ్చు.  

2. మీ కొత్త ఫోన్ లో WhatsAppని తిరిగి పొందడం కోసం WhatsApp SMS ద్వారా ధృవీకరణ అడుగుతుంది. అందుకే  SIM కార్డ్‌ ను లాక్ చేయడం చాలా ముఖ్యం. SIMని లాక్ చేసిన తర్వాత, అదే ఫోన్ నంబర్‌తో  కొత్త SIM తీసుకోండి.   

3. కొత్త సిమ్‌ని పొందిన తర్వాత,  దొంగిలించబడిన మీ ఫోన్‌లో ఉపయోగించిన అదే Apple IDతో మీ iPhoneని సెటప్ చేశారని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు Google డిస్క్‌ని యాక్సెస్ చేయడానికి మీ Google IDకి లాగిన్ కావాలి.

4. మీరు మీ iCloud, Google డిస్క్‌ లో మీ WhatsApp చాట్‌లను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉంటే, మీరు సేవ్ చేసిన అన్ని WhatsApp చాట్‌లను సులభంగా తిరిగి పొందగలుగుతారు.

iCloud నుంచి WhatsApp చాట్‌ను ఎలా  పొందాలంటే?    

⦿ మీ కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

⦿ యాప్‌ని ఓపెన్ చేసి ముందుగా సెటప్ చేయండి.

⦿ మీ కాంటాక్ట్స్,  ఫోటోలు, ఇతర డేటాను యాక్సెస్ చేయడానికి మీరు మీ ఫోన్ నంబర్‌ను ధృవీకరించాలి.

⦿ WhatsApp మీ iCloudలో బ్యాకప్‌ల కోసం స్కాన్ చేస్తుంది. సేవ్ చేసిన బ్యాకప్ నుంచి మీ చాట్ హిస్టరీని పునరుద్ధరించమని మిమ్మల్ని అడుగుతుంది.

⦿ ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలోకావాలి.  మీరు పునరుద్ధరించాలనుకుంటున్న iCloud బ్యాకప్‌ను ఎంచుకోవాలి.

⦿ WhatsApp ఎంచుకున్న iCloud బ్యాకప్ నుండి మీ చాట్‌లను బ్యాకప్ ఇస్తుంది.

⦿ బ్యాకప్ ఫైల్ సైజ్ ను బట్టి టైం తీసుకునే అవకాశం ఉంటుంది.

⦿ బ్యాకప్ తిరిగి పొందిన తర్వాత, WhatsApp మీ అన్ని చాట్‌లు,  మీడియా ఫైల్స్ ను కొత్త ఫోన్‌లో కనిపిస్తాయి.

Google డిస్క్ నుంచి WhatsApp చాట్‌ని ఎలా రికవరీ చేయాలంటే?

⦿ ముందుగా మీ Android ఫోన్ లో  Google Play Store నుంచి WhatsAppని ఇన్‌స్టాల్ చేయాలి.

⦿ WhatsApp యాప్‌ని తెరిచి, సెటప్ ప్రాసెస్‌ చేయాలి.

⦿ మీ Google డిస్క్‌ లో బ్యాకప్ కోసం తనిఖీ చేయడానికి అనుమతి ఇవ్వాలి.

⦿ ప్రాంప్ట్ చేసినప్పుడు, బ్యాకప్ తిరిగి పొందే ప్రక్రియను ప్రారంభించాలి.  ప్రారం

⦿ ప్రక్రియ పూర్తయిన తర్వాత, WhatsApp మీ అన్ని చాట్‌లు, మీడియాను ఫైల్స్ ను మీ కొత్త ఫోన్‌లోకి పునరుద్ధరిస్తుంది.

Read Also: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

Continues below advertisement