X Platform Latest News: మోదీ ప్రభుత్వంపై కేసు వేసిన X, ఐటీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ 

X Platform Latest News: IT చట్టంలోని 79(3)(b)సెక్షన్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ X తప్పుబడుతోంది. స్వేచ్ఛను హరిస్తోందని కేంద్రంపై కేసు వేసింది.

Continues below advertisement

X Platform Latest News: ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X  భారత్ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగింది. కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి IT చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. కర్ణాటక హైకోర్టులో దాఖలైన ఈ కేసులో ఏకపక్ష సెన్సార్‌షిప్,  ఆన్‌లైన్ కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా నియంత్రించడాన్ని సవాలు చేస్తున్నట్‌టు మీడియా నివేదికలు చెబుతున్నాయి ఎక్స్‌ పేర్కొంది. 

Continues below advertisement

IT చట్టం నిబంధనలపై వివాదం
IT చట్టంలోని సెక్షన్ 79(3)(b) ప్రభుత్వ వివరణను పిటిషన్‌లో ఎక్స్ ప్రశ్నిస్తోంది. ఆ సంస్థ ప్రకారం, సెక్షన్ 69Aలో వివరించిన చట్టపరమైన ఫ్రేమ్‌ను దాటి అనధికారిక కంటెంట్ నిరోధించే యంత్రాంగాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఆన్‌లైన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును దెబ్బతీస్తుందని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ వాదిస్తుంది.

IT చట్టంలోని సెక్షన్ 69A ఒక నిర్మాణాత్మక న్యాయపరమైన ప్రక్రియ అందిస్తుంది, ఇది జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి ఇబ్బందికరమైన కంటెంట్ తొలగింపును తప్పనిసరి చేయడానికి అనుమతిస్తుంది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల చట్టవిరుద్ధమైన కంటెంట్‌ నిర్ణయించే భారం సెక్షన్ 79(3)(b) పై ఉంచింది. ఇదే న్యాయపరమైన సమస్యలు, ప్రజలు వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. X వంటి కంపెనీలు కంటెంట్ తొలగింపు ప్లాట్‌ఫారమ్‌లు జోక్యం లేకుండా సెక్షన్ 69A కింద ప్రభుత్వ ఆదేశాల మేరకు జరగాలి అనేది ప్రభుత్వం వెర్షన్.

శ్రేయ సింఘాల్ తీర్పు ప్రస్తావన 
కంటెంట్ బ్లాకింగ్ సెక్షన్ 69A కింద ప్రొసీజర్ ఫాలో కావాలని శ్రేయ సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పును X తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ చర్యలు గత తీర్పులకు, విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్లాట్‌ఫారమ్‌లపై అనవసరమైన బాధ్యత పెడుతున్నారని కంపెనీ పేర్కొంది. న్యాయ పర్యవేక్షణను పక్కదారి పట్టించి, డిజిటల్ స్వేచ్ఛ, జవాబుదారీతనంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని X వాదించింది.

ఓవైపు చట్టపరమైన పోరాటం సాగుతుండగానే సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) AI చాట్‌బాట్, గ్రోక్‌పై ఉన్న అభ్యంతరాలపై Xతో చర్చలు ప్రారంభించింది. చాట్‌బాట్ హిందీలో యాస, అసభ్య పదజాలంతో కూడిన ప్రతిస్పందనలను రూపొందిస్తోందని ఫిర్యాదు చేసింది. ఇది ప్రభుత్వ స్క్రూట్నీ కిందకు వస్తుందని టాక్ నడుస్తోంది. 

గ్రోక్ భాషా అవుట్‌పుట్ వెనుక ఉన్న కారణాల అన్వేషణలో Xతో కలిసి అధికారులు పనిచేస్తున్నారు. "మేము వారితో (X) మాట్లాడుతున్నాం, ఇది ఎందుకు జరుగుతుందో,  సమస్యలేంటో తెలుసుకోవడానికి వారితో (X) మాట్లాడుతున్నాము. వారు మాతో చర్చిస్తున్నారు. " అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్, దాని కంటెంట్ నియంత్రణ విధానాలను ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలించనుంది.

ఈ కేసు భారతదేశంలో కంటెంట్ నియంత్రణ, డిజిటల్ హక్కులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది, ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పని చేసే విధానాన్ని రూపొందిస్తుంది.

Continues below advertisement