సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. ట్విట్టర్ ఫీడ్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ‘Something went wrong. Try reloading.’ అనే ఎర్రర్ మెసేజ్ హోం పేజీలో కనిపిస్తుంది. కింద ‘Retry’ అని కూడా కనిపిస్తుంది. కానీ దానిపై క్లిక్ చేస్తే రీలోడ్ కావడం లేదు.
ట్విట్టర్ డౌన్ అవ్వడం కూడా దశల వారీగా డౌన్ అయింది. మొదట కొంత మంది యూజర్లకు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో #TwitterDown అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ఎన్నో వేల ట్వీట్లు కూడా ఈ ట్రెండ్‌లో పోస్ట్ అయ్యాయి.
‘కొంతమంది ఎలాన్ మస్క్‌ను నిద్ర లేపండి. ఆయన 44 బిలియన్ డాలర్లు పెట్టి కొన్న యాప్ పని చేయడం లేదు.’ అని ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఇలా నెటిజన్లు కొంతమంది ఫన్నీగా, కొంతమంది వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు.
క్రియేటర్లతో యాడ్ రెవిన్యూ పంచుకోవడం ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ హెడ్ ఎలాన్ మస్క్ గతంలోనే తెలిపారు. కంటెంట్ క్రియేటర్ల రిప్లైల్లో కనిపించే ప్రకటనలకు ఈ ఆప్షన్ వర్తిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ కోసం ఇన్‌కం మోడల్‌ను మెరుగుపరచడానికి ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం ఇది. డోగీకాయిన్ (DOGE) ఆధారిత చెల్లింపులను ట్విట్టర్ లాంచ్ చేస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే దానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకుని ఉండాలని పేర్కొన్నారు..
ట్విట్టర్ బ్లూ సర్వీస్ గత సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన తిరిగి రీలాంచ్ అయింది. మొదట ట్విట్టర్ బ్లూ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అనేక లోపాలు తెరపైకి వచ్చాయి. వీటిని మెరుగుపరచడం కోసం కంపెనీ ఈ సర్వీసును రీలాంచ్ చేసింది. ఈ సర్వీసు ప్రస్తుతానికి కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ దీన్ని ప్రతిచోటా విస్తరించాలని యోచిస్తుంది. అతి త్వరలో భారత్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. లాంచ్‌కు ముందు భారతదేశంలో దీని ధరకు సంబంధించిన లీక్‌లు కూడా తెరపైకి వచ్చాయి.
కంపెనీ తన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను నవంబర్‌లో ప్రారంభించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో బ్లూ టిక్ కోసం ప్రతి నెలా యూజర్ల నుంచి నగదు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో లొకేషన్, వెబ్, ఐఓఎస్ ఆధారంగా వేర్వేరు ఫీజులను నిర్ణయించారు. నవంబర్‌లో ఈ సేవ ప్రారంభించినప్పుడు, నకిలీ ట్విట్టర్ ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో కంపెనీ తన బ్లూటిక్ సర్వీసును వెంటనే నిలిపివేసింది. తర్వాత 2022 డిసెంబర్ 13వ తేదీన మళ్లీ రీలాంచ్ చేసింది.