Smartphone Screen Black Out Reasons: ఫోన్ స్క్రీన్ బ్లాక్ అవుట్ అవ్వడాన్ని మీరు తరచుగా చూస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఫోన్ స్క్రీన్ అకస్మాత్తుగా నల్లగా మారుతుంది. కొంత సమయం తర్వాత అది ఆటోమేటిక్‌గా నార్మల్ అవుతుంది. దీనినే బ్లాక్ అవుట్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అయితే ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. అయితే స్క్రీన్ బ్లాక్‌అవుట్ అయిన వెంటనే జనం కంగారుపడి ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌కి తీసుకువెళ్తారు. కానీ చిన్న ప్రయత్నంతో దీన్ని మీరే పరిష్కరించవచ్చు.
మీ ఫోన్‌లో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇప్పుడు మరింత సులభంగా పరిష్కరించవచ్చు. అయితే ముందుగా స్క్రీన్ ఎందుకు బ్లాక్ అవుతుందో తెలుసుకోవడం ముఖ్యం. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్లాక్‌అవుట్‌కు చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని సులభమైన పద్ధతులతో దీనిని పరిష్కరించవచ్చు.
అవుట్ డేటెడ్ యాప్స్
స్క్రీన్ బ్లాక్ అవడానికి అతిపెద్ద కారణం యాప్స్. కొన్ని పాత లేదా అవుట్ డేటెడ్ యాప్స్ ఫోన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అనుకూలంగా లేకపోయినా లేదా వాటిలో లోపాలున్నా స్క్రీన్ బ్లాక్ అవుట్ అవుతుంది. కాబట్టి.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!
మైక్రో ఎస్‌డీ కార్డు కూడా...
కొన్నిసార్లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన మైక్రో ఎస్‌డీ కార్డు కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది. మీరు మరొక ఫోన్ లేదా పీసీ నుంచి మెమొరీ కార్డుకి పాటలు, ఫోటోలు, వీడియోలు మొదలైనవాటిని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు దాని నుంచి వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ మీ ఫోన్‌ను పాడు చేయడం ప్రారంభిస్తుంది.
వైరస్ వల్ల కూడా...
ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు లేదా డేటాను బదిలీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వైరస్ ఎప్పుడైనా ఫోన్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది మీ ఫోన్‌లో సమస్యలను కలిగిస్తుంది. ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయిపోతే, మీ ఫోన్‌లో వైరస్ ఉండే అవకాశం కూడా ఉంది.
బ్యాటరీతో సమస్య?
ఈ రోజుల్లో చాలా ఫోన్‌లు నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్నాయి. దీని కారణంగా స్క్రీన్ బ్లాక్‌అవుట్ సమస్య ఉంది. దాని గురించి మీకు కూడా తెలియదు. అందుకే యాప్స్ కారణంగా మీ ఫోన్‌లో ఎలాంటి సమస్య లేకపోయినా బ్యాటరీ వల్ల మీ ఫోన్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి?
మీ ఫోన్ మళ్లీ మళ్లీ బ్లాక్ అవుతూ ఉంటే, ముందుగా ఈ మధ్య ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఫోన్‌ను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకపోతే మీ ఫోన్‌ని సేఫ్ మోడ్‌లో ఒకసారి రీస్టార్ట్ చేయండి.
మీరు ఫోన్‌లో బ్యాటరీ రిమూవబుల్ అయితే దాని బ్యాటరీని తీసివేయడం ద్వారా కూడా ఫోన్ బ్లాక్అవుట్ సమస్యను పరిష్కరించవచ్చు. కాబట్టి ఫోన్ బాడీని జాగ్రత్తగా చెక్ చేసి బ్యాటరీ డ్రైయిన్ అయిపోతుందో లేదో చూడాలి. అలా అయితే ఫోన్ బ్యాటరీని మార్చండి.