టెక్నో మొబైల్ సంస్థ 5జీ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టింది. కొత్త స్మార్ట్ ఫోన్ పోవా 5జీ (Pova 5G) మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది. మాంఛెస్టర్‌లోని ఫుట్ బాల్ క్లబ్‌లో జరిగిన వేడుకలో ఎథర్ బ్లాక్ కలర్‌లో ఉన్న పోవా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ టెక్నో పోవా 5జీ ఫోన్లో ఫీచర్స్ ఇలా ఉన్నాయి. డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 8జీబీ + 3జీబీ వర్చువల్ ర్యామ్, 120 రీఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ + డాట్ ఇన్ డిస్ప్లే వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి.


ఇప్పటికే చవక ధరల్లో స్మార్ట్ ఫోన్ కేటగిరీలో దూసుకుపోతున్న ఈ చైనాకు చెందిన టెక్నో సంస్థ.. ఇకపై ఓ మాదిరి బడ్జెట్ నుంచి హై బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ట్రాన్సేషన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, “భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్. ఇక్కడ 5జీకి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్‌లోకి POVA 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అనేది టెక్నో సంస్థ వృద్ధి వ్యూహంలో ఒక భాగం. ఈ ఆవిష్కరణతో మేము 5జీ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నాం. ఈ POVA స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి శ్రేణిలో పూర్తి 5జీ పోర్ట్‌ఫోలియోను రూపొందించే ప్రక్రియలో మేం ఉన్నాం. ప్రీమియం అనుభవాలను సహేతుకమైన ధరకు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలనేది మా ఆలోచన.’’ అని అన్నారు.


ప్రాసెసర్
* 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
* 2.4 గిగా హెర్జ్ క్లాక్ స్పీడ్, LPDDR5 RAM
* 8జీబీ LPDDR5 RAM (దీన్ని ఫ్యుజన్ టెక్నాలజీ ద్వారా మరో 3జీబీ వరకూ అంటే మొత్తం 11 జీబీ పెంచుకొనే వీలుంది)
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డు స్లాట్ ద్వారా 512 జీబీ వరకూ పెంచుకొనే సామర్థ్యం)


ఓఎస్
* HiOS 8.0 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై పోవా 5జీ పని చేస్తుంది


కెమెరా
* టెక్నో పోవా 5జీలో 50 మెగా పిక్సల్స్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా
* 16 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా


బ్యాటరీ
* ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. 18 వాట్స్ ఛార్జర్‌తో పని చేస్తుంది.


ధర 
* TECNO Pova 5G స్మార్ట్ ఫోన్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. దీని ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 14 నుంచి ఆమెజాన్‌లో ప్రారంభం కానుంది.