దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఫోల్డబుల్ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. శాంసంగ్  గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లను ఆగస్టు 20వ తేదీన భారతదేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొన్ని లీకులను ఇచ్చింది.






శాంసంగ్ ఇండియా ట్విట్టర్ ఫేజ్ ఈ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకుంది. బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో ఇంటరాక్షన్ ద్వారా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3లను దేశంలో లాంచ్ చేయడాన్ని ప్రస్తావించింది. వీటిని బట్టి చూస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్లకు ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. 






శాంసంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్‌లో భాగంగా ఆగస్టు 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ బడ్స్ 2తో పాటు గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో జెడ్ ఫోల్డ్ 3 ధర.. 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,33,6000), జెడ్ ఫ్లిప్ 3 ధర 999.99 డాలర్లుగా (సుమారు రూ.74,200)  ఉంది. ఈ రెండు ఫోన్లలోనూ ఐపీఎక్స్ 8 (IPX8) వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తీసుకొచ్చారు. అలాగే ఈ రెండు మోడల్స్ లోనూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ అందించారు. వీటి మెయిన్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 Hzగా ఉంది. 


జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 కెమెరా సెటప్..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో 12 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇవి డ్యూయల్ ఓఐఎస్ సపోర్టుతో పనిచేస్తాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లో .. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 10 మెగాపిక్సెల్ కెపాసిటీ ఉన్న ఫ్రంట్ కెమెరాను అందించారు. 


Also Read: Galaxy Z Fold, Z Flip: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు లీక్.. స్పెషల్ ఎట్రాక్షన్ అదే