Samsung Galaxy Unpacked 2023: కొరియన్ కంపెనీ శాంసంగ్ ఈ సంవత్సరంలో తన అతిపెద్ద ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ శాన్ ఫ్రాన్సిస్కోలో బుధవారం జరిగింది, ఈ ఈవెంట్‌లో అనేక డివైస్‌లు లాంచ్ అయ్యాయి. మూడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కూడా లాంచ్ అయ్యాయి. ఇవి చాలా గొప్ప ఫీచర్లతో వచ్చాయి. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra) ఫోన్లను లాంచ్ చేసింది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్
శాంసంగ్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన Samsung Galaxy Unpacked ఈవెంట్ 2023లో ప్రీమియం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. సిరీస్ పేరు Samsung Galaxy S23. ఈ సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్‌లు ప్రవేశపెట్టబడ్డాయి, వీటిలో Samsung Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra ఉన్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 10 మెగాపిక్సెల్ మూడవ లెన్స్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
3,900 mAh బ్యాటరీని అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ స్పెసిఫికేషన్లు
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ పని చేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది.
ఫోన్‌ వెనుక వైపు ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP + 12MP + 10MP కెమెరా సెటప్ అందించారు.
ముందు సెల్ఫీ కెమెరాగా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
4,700 mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 6.8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 3088 పిక్సెల్స్‌గా ఉంది.
సెక్యూరిటీ కోసం ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
ప్రాసెసర్ గురించి చెప్పాలంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఆక్టా-కోర్ ప్రాసెసర్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌పై పని చేయనుంది.
ఈ ఫోన్‌లో వెనకవైపు 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్న ఫోన్ కూడా అందుబాటులో ఉంది.
సెల్ఫీ కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో మీకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


ఫోన్ ధర ఎంత
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర అమెరికాలో 799 డాలర్లుగా ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో సుమారుగా రూ.65,486.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ ధర USలో 999 డాలర్లుగా ఉంది. మనదేశ కరెన్సీలో రూ.81 వేల పైమాటే.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర అమెరికాలో 1,199 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ.98,271.