శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎస్21 మోడల్స్ కంటే బోలెడన్ని అప్‌గ్రేడ్లు ఇందులో చేశారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఈ ఫోన్లలో అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర
ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.76,999గా ఉంది. గ్రీన్, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ ధర
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ ధర రూ.84,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది. ఈ ఫోన్ కూడా గ్రీన్, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే ఉన్నాయి. ఇందులో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.1,09,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,18,999గా ఉంది. అమెరికాలో లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ కాలేదు. బర్గండీ, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు. ఆర్మర్ అల్యూమినియం చాసిస్ కూడా ఇందులో ఉంది. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 


యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో శాంసంగ్ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 168 గ్రాములుగా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో శాంసంగ్ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో శాంసంగ్ అందించింది. గెలాక్సీ ఎస్22 తరహాలోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోన్ బాడీలోనే మొదటిసారి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512  జీబీ వరకు స్టోరేజ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, యూడబ్ల్యూబీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ ఇందులో అందించింది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 229 గ్రాములుగా ఉంది.