శాంసంగ్ గెలాక్సీ ఎం54 5జీ స్మార్ట్ ఫోన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీ ఇదే. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉన్నాయి.


ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. సింగిల్ సిల్వర్ కలర్‌వే ఆప్షన్‌లో ఈ మొబైల్ లాంచ్ అయింది. త్వరలో ఈ ఫోన్ ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ధర మనదేశంలో రూ.25 వేల రేంజ్‌లో ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం54 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో ఏ ప్రాసెసర్ ఉపయోగించారో చెప్పలేదు. అయితే సీపీయూ స్పీడ్‌ను గమనిస్తే ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు.


ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.


256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వైఫై 6, 5జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, నావిక్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 55 గంటల వరకు టాక్ టైమ్, 23 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను ఈ ఫోన్ అందించనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం04 స్మార్ట్ ఫోన్‌ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎం04లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కూడా అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించారు. బ్లూ, గోల్డ్, మింట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం04 కొనవచ్చు.


ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఈ ఫోన్‌లో ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం04 పని చేయనుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.