స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త మోడల్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో శాంసంగ్ గెలాక్సీ F16 5G, శాంసంగ్ గెలాక్సీ M16 5G లను విడుదల చేయనుంది. అక్టోబర్ 2024లో  గెలాక్సీ A16 5Gని లాంచ్ చేయగా.. రెండు కొత్త మోడల్స్ మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. ఇప్పటివరకూ ఆ మోడల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ కాగా, తాజాగా ఎఫ్16 5జీ, ఎం16 5జీ ఫోన్ల ధరలు లీక్ అయ్యాయి. 

సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అభిషేక్ యాదవ్ భారతదేశంలో ఈ 2 శాంసంగ్ కొత్త మోడళ్ల ధరల వివరాలను వెల్లడించారు. శామ్‌సంగ్ గెలాక్సీ F16 5G,  గెలాక్సీ M16 5G లను 3 కాన్ఫిగరేషన్‌లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 4GB RAM + 128GB స్టోరేజ్ ఒక కాన్ఫిగరేషన్ కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ తో పాటు గరిష్టంగా 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రెడీ చేసింది. వీటిలో బేస్ వేరియంట్ మొబైల్ ధర భారత కరెన్సీలో రూ. 13,499 కాగా, అందులో టాప్-ఎండ్ మోడల్ ఫోన్ ధర రూ. 16,499 వరకు ఉండనుంది.

 

శాంసంగ్ Galaxy M16 5G ఫిబ్రవరి 27, 2025న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. అయితే, Samsung Galaxy F16 5G మోడల్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇదివరకే F-సిరీస్ మోడల్ సంబంధించి కోసం సపోర్ట్ పేజీని తీసుకొచ్చారు. దాంతో త్వరలోనే ఆ మోడల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది.  F-సిరీస్ పాత ట్రెడీషన్ పక్కనపెట్టి, ఈ మోడల్ కేవలం భారత మార్కెట్‌లో స్పెషల్ గా లాంచ్ అవుతుందని  భావిస్తున్నారు.

శాంసంగ్ Galaxy F16 5G, M16 5G స్పెసిఫికేషన్లు లీక్..త్వరలో లాంచ్ కానున్న రెండు స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ కెపాసిటీ, రంగు లాంటివి ఒకేలా ఉంటాయి. F16 5G, M16 5G స్పెసిఫికేషన్‌లను చాలావరకు Galaxy A16 5Gతో మ్యాచ్ అవుతాయని తెలుస్తోంది. వీటిలో A-సిరీస్ వేరియంట్ లా 5,000mAh బ్యాటరీ కాకుండా 6,000mAh కెపాసిటీ అంచనా వేస్తున్నారు.

6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ స్పెసిఫికేషన్లతో రానుంది. ఈ కొత్త మోడల్స్‌కు MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌, Android 15 ఓఎస్ తో Samsung One UI 7.0పై రన్ అవుతుందని ప్రచారంలో ఉంది.

Galaxy M16 5G, Galaxy F16 5G రెండు మోడల్‌ ఫోన్లలో వెనుక భాగంలో 3 కెమెరాలు,  50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరా ఉంటాయి. 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్-సిమ్ 5G సపోర్ట్, బ్లూటూత్ 5.3 ఉన్నాయి.  USB టైప్-C పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi ac, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లతో బడ్జెట్ ధరలలో అందుబాటులోకి రానున్నాయి.

Also Read: iphone 16e Latest News : ఐఫోన్ 16eపై ఏకంగా పదివేల తగ్గింపు - 28 నుంచి అమ్మకాలు స్టార్ట్