శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి ఎక్కువ సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. గతంలో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కేవలం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే శాంసంగ్ ఉపయోగించేది. గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లు మిడ్ రేంజ్ ప్రీమియం విభాగంలో వస్తాయి. అయితే ఇందులో ఫ్లాగ్ షిప్ ఫోన్లలో అందించే 108 మెగాపిక్సెల్ సెన్సార్‌నే అందిస్తారా.. లేక కొత్త 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందిస్తారా అనే విషయం తెలియరాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ 2022లో లాంచ్ కానుందని తెలుస్తోంది. @GaryeonHan అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఈ విషయాన్ని మొదట లీక్ చేశారు. దీన్ని శాంసంగ్ మొబైల్ అప్‌డేట్లను అందించే శామ్‌మొబైల్ మొదట తెలిపింది. శాంసంగ్ మొట్టమొదటిసారి గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించింది. తర్వాత దీన్ని ఎస్21 అల్ట్రాలో కూడా అందించారు. అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ73లో ఈ ఫోన్లలో అందించే సెన్సార్‌ను అందిస్తుందా... లేక వేరే సెన్సార్‌ను అందిస్తుందా అనే విషయం తెలియరాలేదు.
శాంసంగ్ కూడా ఈ ఫోన్ గురించి అధికారిక సమాచారం ఏదీ ప్రకటించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో ఐసోసెల్ హెచ్ఎం3 సెన్సార్‌ను అందించారు. ఇందులో 1/1.33 అంగుళాల సెన్సార్‌ను అందించారు. దీని పిక్సెల్ సైజు 0.8 నానోమీటర్లుగా ఉంది. గతంలో వచ్చే కథనాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో మెరుగు పరిచిన 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
హార్డ్‌వేర్‌లో మార్పుల కంటే సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌కు సంబంధించిన అప్‌డేట్లు ఇందులో చేశారని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో 2022లో లాంచ్ అయ్యే అన్ని ఫోన్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52, ఏ72 ఫోన్లలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం ఎంట్రీ లెవల్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ22 స్మార్ట్ ఫోన్‌లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉన్న 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. శాంసంగ్ లాంచ్ చేసే ఫోన్లలో మోస్ట్ పాపులర్ సిరీస్ గెలాక్సీ ఏ-సిరీసే.
శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందిస్తుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ సెన్సార్‌ను షియోమీ 12 స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారని సమాచారం. అయితే ఒకవేళ శాంసంగ్ నిజంగానే 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందిస్తే.. ఆ సెన్సార్ కేవలం షియోమీ 12లోనే కాకుండా.. శాంసంగ్ ఫోన్లలో కూడా ఉండే అవకాశం ఉంది.
Also Read: Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!
Also Read: Redmi TV: రెడ్‌మీ కొత్త టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.20 వేలలోపే!