రెడ్‌మీ స్మార్ట్ టీవీలు మనదేశంలో సెప్టెంబర్ 22వ తేదీన లాంచ్ కానున్నాయి. 32 అంగుళాలు, 43 అంగుళాల స్మార్ట్ టీవీలను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాం వెబ్ సైట్లలో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. వీటిలో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


రెడ్‌మీ స్మార్ట్ టీవీల ఫీచర్లు
దీనికి సంబంధించిన ఈవెంట్ పేజీని రెడ్‌మీ ఇప్పటికే క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇందులో 20W స్పీకర్‌ను అందించనున్నారు. డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్: ఎక్స్ సరౌండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


లేటెస్ట్ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే మొదటి టీవీలు ఇవే కానున్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, ఆటో లోలేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో షియోమీ అందించింది.


షియోమీ ఇటీవలే రెడ్‌మీ ఇటీవలే రెడ్‌మీ ఇయర్ బడ్స్ 3 ప్రోను మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధరను రూ.2,999గా నిర్ణయించారు. బ్లూ, పింక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో ఎయిర్ పోడ్‌లో 43 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. చార్జింగ్ కేస్ బ్యాటరీ సామర్థ్యం 600 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 7 గంటల ప్లేబ్యాక్‌ను, చార్జింగ్ కేస్ ద్వారా మొత్తం 30 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందిస్తాయని తెలుస్తోంది.


వీటిలో క్వాల్ కాం క్యూసీసీ3040 ప్రాసెసర్‌ను అందించారు. యాప్ట్ఎక్స్ అడాప్టివ్ కోడెక్‌ను ఇందులో అందించారు.  బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు లో లేటెన్సీని ఇది అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ద్వారా మీరు కాల్స్ మాట్లాడవచ్చు. కట్ చేయవచ్చు. మ్యూజిక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. టచ్ కమాండ్స్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు.


రెడ్ మీ ఎయిర్ డాట్స్ 3లో ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందించారు. వీటి బరువు 4.6 గ్రాములుగా ఉంది. కేస్‌తో కలిపితే మొత్తం బరువు 51 గ్రాములుగా ఉంది. ఇందులో ఎల్ఈడీ ఇండికేటర్‌ను అందించారు. వన్ క్లిక్ కనెక్షన్ బటన్ కూడా ఇందులో ఉంది. వీటి ద్వారా ఇయర్ బడ్స్‌ను రీసెట్ కూడా చేయవచ్చు.


Also Read: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?


Also Read: Infinix: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. రూ.9 వేలలోపు సూపర్ ఫీచర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనేయచ్చు!


Also Read: Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!