రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ఇప్పుడు జియో వెబ్‌సైట్, మై జియో యాప్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.


జియో రూ.750 ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా అందించనున్నారు. దీంతోపాటు అదనంగా మరో 100 ఎంబీ డేటా కూడా లభించనుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ ప్లాన్‌లో అందించారు. దీంతోపాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.


భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే జియో రూ.2,999 ఇండిపెండెన్స్ ఆఫర్. ఈ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే 100 శాతం వాల్యూ బ్యాక్ లాభాలు లభించనున్నాయి.


రిలయన్స్ జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించనుంది. అంటే మొత్తంగా 912.5 జీబీ డేటాను జియో ఈ ప్లాన్ ద్వారా అందించనుందన్న మాట. డైలీ డేటా లిమిట్ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోనుంది. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభించనున్నాయి.


దీంతోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. ఈ రీచార్జ్‌తో వినియోగదారులకు రూ.2,250 విలువైన లాభాలు లభించనుంది. రూ.750 విలువైన ఏజియో, రూ.750 విలువైన నెట్‌మెడ్స్, రూ.750 విలువైన ఎక్సిగో కూపన్లను జియో ఈ రీచార్జ్‌తో అందించనుంది. రీచార్జ్ చేసుకున్న 72 గంటల్లో మై జియో యాప్‌లో ఈ వోచర్లు క్రెడిట్ అవనున్నాయి. దీంతోపాటు రూ.750 విలువైన 75 జీబీ అదనపు డేటా కూడా లభించనుంది.


అర్హులైన సబ్‌స్క్రైబర్లు మైజియో యాప్‌లోని వోచర్ సెక్షన్‌లో ఈ డేటా వోచర్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కూపన్లు, వోచర్లు నాన్ ట్రాన్స్‌ఫరబుల్. అంటే కేవలం రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే ఉపయోగించుకోవచ్చన్న మాట.


రూ.2,250 విలువైన మైజియో, ఎక్సిగో, నెట్‌మెడ్స్ కూపన్లు, రూ.750 విలువైన డేటా వోచర్ అంటే మొత్తం రూ.3,000 విలువైన లాభాలు లభించనున్నాయన్న మాట. అందుకే జియో దీన్ని 100 శాతం వాల్యూ బ్యాక్ ఆఫర్ అని పిలిచింది. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో క్లౌడ్‌లకు కూడా ఈ ప్లాన్ ద్వారా ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.


జియో ఇటీవలే రూ.155, రూ.185 ప్లాన్ల ధరను పెంచింది. ఈ రెండు ప్లాన్ల ధరలూ రూ.30కి పైగా పెరిగాయి. జియోఫోన్‌కు అందుబాటులో ఉన్న చవకైన ప్లాన్లలో ఈ రెండూ ఉన్నాయి. జియోఫోన్ రూ.155 ప్లాన్ ధరను రూ.186కు పెంచారు. అంటే దీని ధర రూ.31 పెరిగిందన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4జీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 50 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు కూడా యాక్సెస్ లభించనుంది.


ఇక జియోఫోన్ రూ.185 ప్లాన్ ధర రూ.222కు పెరిగింది. అంటే దీని ధరను ఏకంగా రూ.37 పెంచారన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులే. అయితే రోజుకు 2 జీబీ అన్‌లిమిటెడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి లాభాలు కూడా ఈ ప్లాన్‌తో లభించనున్నాయి. ఇక మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉన్నాయి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!