Redmi Turbo 5 Big Battery Mobile: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త ఫీచర్లతో పాటు ఫోకస్ చేస్తున్న మరో అంశం ఫోన్ బ్యాటరీ. అవునండీ ఇప్పుడు తమ ఫోన్‌లలో సాధ్యమైనంత పెద్ద బ్యాటరీ పవర్ ఇవ్వాలని భావిస్తున్నాయి. గత కొంతకాలంగా గేమింగ్ లవర్స్ పెరగడంతో పెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. రెడ్‌మీ ఇప్పుడు ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం రెడ్‌మీ 9,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌ను చైనా రేడియో సర్టిఫికేషన్ ప్లాట్‌ఫాంలో గుర్తించారు. 

Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. రాబోయే రెడ్‌మీ టర్బో 5 OLED ప్యానెల్, రౌండెడ్ కార్నర్‌లతో వస్తుంది. దీని స్క్రీన్ 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందిస్తున్నారు. రెడ్‌మీ టర్బో 4లో కంపెనీ ఆప్టికల్ ఇన్-స్క్రీన్ సెన్సార్‌ను ఇచ్చిందని తెలిసిందే. కనుక ఫోన్లో ఇది పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్ అని వివరాలు లీక్ అయ్యాయి. దీని చిప్‌సెట్ సమాచారం మాత్రం బయటకు రాలేదు. అయితే  Dimensity 8500 Ultra అమర్చారని భావిస్తున్నారు.

 శక్తివంతమైన బ్యాటరీతో వస్తున్న Redmi Turbo 5

టిప్‌స్టర్ ప్రకారం Redmi Turbo 5 ఫోన్ 9000mAh సిలికాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 100W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. కొత్త మోడల్ టర్బో 4 లాగానే ఉండవచ్చు.

ఎప్పుడు లాంచ్ అవుతుంది..

కంపెనీ దీని వివరాలపై అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే టిప్‌స్టర్ ప్రకారం, ఇది వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే 2026 ఏప్రిల్ తరువాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట ఇది చైనాలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత Poco X8 Pro రూపంలో గ్లోబల్ మార్కెట్‌లోకి రావొచ్చు అని భావిస్తున్నారు. ఫోన్ గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ 9000 mah బ్యాటరీ అనగానే.. ఈ మొబైల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని బిగ్ బ్యాటరీ కోసం చూసేవారు ఎదురు చూస్తున్నారు.